Monday, June 11, 2012

వెరైటీ స్టఫ్డ్ పొటాటో కుల్చాలు...

Stuffed Potato Kulcha
 స్కూళ్లు మొదలయ్యాయి. లంచ్‌ బాక్సులో ఏం పెట్టాలి... ఏది పెడితే వెనక్కి రాకుండా ఉంటుంది...
అన్న చింత కూడా తల్లులకు మొదలు. చపాతీ, పూరీ అన్నీ బోరే. అందుకే చేయండి వెరైటీ కుల్చాలు(పరాటాలు)...ఉదయాన్నే ఏదో ఒకటి తినేయడం అని కాకుండా ఆరోగ్యవంతమైన బ్రేక్‌ఫాస్ట్‌ను ఎంచుకుని పెడితే మరిన్ని పోషకాలు అందుతాయి. సెరల్స్‌లో కార్బోహైడ్రేట్స్, పీచు ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లలకు చాలా మంచి ఆహారం. వీటితో పాటు పాలు ఇస్తే అవసరమైన కాల్షియం, ప్రొటీన్ లభిస్తుంది. చల్లని ఈ శీతాకాల ఉదయాలకు గ్రీన్ పరోటాలు ఎక్కువ మేలు చేస్తాయి. మెంతి ఆకులు ఇతర ఆకులేవైనా గోధుమపిండిలో వేసి కలిపి పరోటాలు చేసి పెడితే కలర్‌ఫుల్‌గా మాత్రమే కాదు, అత్యంత పోషకాలతో నిండి ఉంటాయి. ఈ పరోటాలనే కొంచెం వెరైటీగా వండితే కుల్చాలు అంటారు. పిల్లలూ ఇష్టంగా తింటారు. పిల్లలకు బ్రేక్‌ప్రాస్ట్ కీలకమైన ఆహారం. పిల్లలు ఏం తినకుండా స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్ళిపోతే శరీరంలో గల శక్తినిల్వల్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నిల్వశక్తి స్ట్రెస్ హార్మోన్ ద్వారా విడుదలవుతుంది. కాబట్టి పిల్లలు అలసటగా, విసుగ్గా, చిరాగ్గా మారిపోవడం మనం గమనిస్తాం.
కావలసిన పదార్థాలు:
మైదా: 4cups
పెరుగు: 1cup
బేకింగ్‌ సోడా: 1/2tsp
నెయ్యి: 1/2cup
ఉప్పు: రుచికి తగినంత
బంగాళాదుంపలు: 4
జీలకర్రపొడి: 1tsp
గరంమసాలా: 1tsp
నూనె: 4tbsp
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా బంగాళాదుంపల్ని ఉడికించి పొట్టు తీయాలి. తర్వాత వాటిని మెత్తగా చిదమాలి.
2. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి నూనె వేసి కాగాక ఈ చిదిమిన దుంపలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. తరువాత గరంమసాలా, జీలకర్ర పొడి, ఉప్పు వేసి తక్కువ మంటమీద ఓ ఐదు నిమిషాలు వేయించి దించాలి.
3. కుల్చాల తయారీ: ఒక బౌల్ తీసుకొని అందులో మైదా, ఉప్పు, బేకింగ్‌సోడా వేసి కలపాలి.
4. తరువాత అందులోనే పాలు, నెయ్యి, పెరుగు వేసి నెమ్మదిగా కలపాలి. అవసరమైతేనే కొద్దిగా నీళ్లు చల్లాలి.
5. పిండి కలుపుకున్న తరువాత తడిబట్ట కప్పి 2 గంటలు ఉంచాలి. ఆపై పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి, ఒక్కోదాన్ని చిన్న పూరీలాగా వత్తాలి.
6. వాటిలో ముందుగా తయారు చేసిన దుంపల స్టఫ్‌ ను అందులో పెట్టి అంచులను మూసివేసి చపాతీల్లాగా వత్తాలి. వీటిని వేడి పెనంమీద నెయ్యితో ఎర్రగా కాల్చితే కుల్చాలు రెడీ..!

No comments:

Post a Comment