Wednesday, May 16, 2012

క్యారెట్-కార్న్(మొక్కజొన్న) సూప్

Fat Free Carrot Corn Soup

భోజనానికి కావాలి ఓ సూప్....
కావలసిన పదార్థాలు:
క్యారెట్: 3cups(ఉడికించి చిదిమిపెట్టుకొన్నది)
స్వీట్ కార్న్: 1/4cup(ఉడికించి చిదిమిపెట్టుకొన్నది)
ఉల్లిపాయముక్కలు: 1tbsp......................
సెలరే: 1/4cup
వెజిటేబుల్ స్టాక్: 4cup(అన్నిరకాల కూరగాయ ముక్కలను ఉడికించిన నీళ్ళు)
టబాస్కో సాస్: 1tbsp
నిమ్మరసం: 2tsp
నూనె: 1tbsp
క్రీమ్: 1/2cup
పాలు: 1/2cup
ఉప్పు: రుచికి తగినంత
పెప్పర్ పౌడర్ లేదా కారం: తగినంత

తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి రెండు నిమిషాలు వేగనివ్వాలి.
2. తర్వాత అందులో ఉడికించి గుజ్జు చేసి పెట్టుకొన్న క్యారెట్, కార్న్ ను పోసి తక్కువ మట్టలో ఉడికించాలి.
3. ఇప్పుడు అందులోనే టబాస్కో సాస్, ఉప్పు, పెప్పర్ పౌడర్, వెజిటెబల్ స్టాక్ వేసి బాగా కాగనివ్వాలి.
4. కొద్దిసేపటి తర్వాత పాలు, క్రీమ్ వేసి రెండు నిమిషాలు పాటు కాగనివ్వాలి.
5. చివరగా నిమ్మరసం కలిపి పక్కకు దింపుకొని హాట్ హాట్ గా సర్వ్ చేయాలి.

No comments:

Post a Comment