Tuesday, May 15, 2012

చట్నీ ఒక్కటే...బ్రేక్ ఫాస్ట్ రకరకాలు

కావలసిన పదార్థాలు:
టమోటో: 6-8
వేరుశెనగగింజలు: 1/2cup
ఉల్లిపాయలు: 2.....................
కారంపొడి: 2tsp
పసుపు: 1/4tsp
చింతగుజ్జు: 2tsp
ఉప్పు: రుచికి తగినంత
నూనె: 1tbsp
లవంగాలు: 4
జీలకర్ర: 1/4tsp
మెంతి: 1/4tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా వేరుశెనగగింజలను వేయించి, చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మృదువుగా పౌడర్ చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత టమోటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి వేడయ్యాక అందులో మెంతులు వేసి సన్నని మంటమీద వేయించాలి.
4. తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకొన్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమోటో ముక్కలను ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా వేసగనివ్వాలి.
5. ఇలా వేయించి పెట్టుకొన్న టమోటా మిశ్రమాన్ని కూడా చల్లారనిచ్చి, మిక్సీలో వేసి, అందులో వేరుశెనగపప్పు పౌడర్, మిగిలిన పదార్థాలన్నీకూడా వేసి గ్రైండ్ చేసి, చట్నీ తయారు చేసుకోవాలి. అవసరం అనుకొంటే కొద్దిగా వేడినీళ్లు కలుపుకోవచ్చు.
6. అంతే టమోటో వేరుశెనగపప్పు చట్నీ రెడీ..ఇది కావాలనుకొంటే పోపుదినుసులతో పోప్ పెట్టుకోవచ్చు. ఈ రుచికరమైన చట్నీని వేడి వేడి దోశ, ఇడ్లీ, చపాతీ, పూరీ, అల్పాహారానికే కాకుండా అన్నం కూడా మంచి కాంబినేషన్.

No comments:

Post a Comment