Monday, May 21, 2012

బొంబాట్ బొబ్బట్టు-తినకుంటే ఒట్టుపెట్టు

Pachi Mamidi Raw Mango Bobbatlu Summer Special

వేసవిలో విరివిగా లభించే మామిడిని చూస్తే ఎవరికైనా నోరూరుతుంది. రుచిలో మాత్రమే కాదు............
గుణాల్లోనూ ఈ పండు ప్రత్యేకతే వేరు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేసవిలో అరుదుగా దొరికే మామిడికాయ అన్నంతో మొదలయ్యే ఆవకాయ పెరుగున్నదాకా కొనసాగుతుంది. సాదారణంగా మామిడితో స్పైసీ ఐటమ్స్ మాత్రమే చేసుకొంటాం. లేదంటే సలాడ్స్, మామిడి స్కాష్ ఇలా రకరకాలుగా చేసుకొంటాం. మామిడితో స్వీట్ ఎలా చేస్తారు? అదీ ఆంధ్ర, కర్ణాటక వారికి అత్యంత ప్రీతికరమైన వంటకం బొబ్బట్లు, కొబ్బరి బొబ్బట్లు, కాయ బొబ్బట్లు, పూర్ణం బొబ్బట్లు బాగా ఫేమస్ అయితే కొన్ని కొంచెం డిఫరెంట్ గా మామిడి బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం.......
కావలసిన పదార్థాలు:
మామిడి తురుము: 2cups
క్యారెట్ తురుము: 1cup
బీట్ రూట్ తురుము: 1cup
పచ్చికోవా: 1cup
మైదా: 3cup
నెయ్యి: 1
పంచదార: 2
యాలకులపొడి: 1
ఉప్పు: రుచికి తగినంత
నూనె: కొద్దిగా
తయారు చేయు విధానం:
1. ముందుగా మైదాపిండిలో ఉప్పు, పంచదార, పాలు చేర్చి మృదువుగా కలపి పెట్టుకోవాలి.
2. గంట తర్వాత పాన్ లో రెండు చెంచాల నెయ్యి వేడి చేసి బీట్ రూట్, క్యారెట్ తురుములను పచ్చివాసన పోయే వరకూ వేయించాలి.
3. అందులో మామిడి తురుము కూడా చేర్చి మరికిసేపు వేగనివ్వాలి. పదినిమిషాల తర్వాత పంచదార వేసి బాగా కలబెట్టి, రెండు నిమిషాల తర్వాత కొద్దిగా నీళ్లు చేర్చి మూత పెట్టాలి.
4. పై మిశ్రం కొద్దిగా బాగా ఉడికి, దగ్గరపడ్డాక పచ్చికోవా, యాలకుల పొడి చేర్చి స్టౌ ఆఫ్ చేసి క్రిందికి దింపుకోవాలి.
5. ఇప్పుడు మైదాపిండిని చిన్న ఉండల్లా చేసుకొని, పూరీలా ఒత్తుకొని అందులో పచ్చిమామిడి మిశ్రమాన్ని కొద్దిగా పెట్టి చేత్తో ఒత్తుకోవాలి.
6. స్టౌ వెలిగించి పాన్ పెట్టి వేడయ్యాక నూనె వేసి, ఒత్తి పెట్టుకొన్న మామిడి బొబ్బట్టును వేసి, రెండు వైపులా కాల్చుకుంటే మామిడి బొబ్బట్లు రెడీ....

No comments:

Post a Comment