Tuesday, December 20, 2011

నల్లమచ్చలు తగ్గాలంటే ఏం చేయాలి?

* అలోవెరా గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే మొటిమల తాలూకు నల్లమచ్చలు తగ్గి ముఖం నునుపుగా అందంగా మారుతుంది. ............
* పచ్చిపాలలో కొద్దిగా ఉప్పు వేసి కళ్ళ చుట్టూ రాస్తే కళ్ళ క్రింద ఉన్న నల్లమచ్చలు క్రమంగా తగ్గుతాయి. వాటితో పాటు కళ్ళకు చల్లదనాన్ని కూడా ఇస్తుంది.

* కొద్దిగా బియ్యం గింజలను కాస్త పాలలో నానబెట్టి ఐదు గంటల తర్వాత బియ్యాని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని వేళ్లతో 5-10 నిముషాలు మర్దనా చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ముఖం పైన తడి లేకుండా తుడుచుకొని తేనె రాసి 10 నిముషాలు తరువాత శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తే మృతకణాలు, బ్లాక్‌హెడ్స్ పోయి ముఖం కాంతివంతంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

No comments:

Post a Comment