'నారీ నారీ నడుమ మురారి', 'ఆయనకు ఇద్దరు'... వగైరా కతలన్నీ సినిమాల్లో చూడటానికీ, చూసి నవ్వుకోవడానికీ బావుంటాయి............................ఇదే ప్రశ్న ప్రసన్నను అడిగితే కంటివెంట కన్నీరు తప్ప నోటివెంట మాటరాదు. కారణం ప్రసన్న భర్తకు దూరమై జీవచ్ఛవంలా బతుకుతున్న ఇల్లాలు. ముగ్గురు పిల్లల తల్లి. భర్త ఆదరణకు దూరమై... పుట్టింటికీ, అత్తింటికీ భారంగా జీవనం సాగిస్తున్న సగటు గృహిణి. ప్రస్తుతం ఆమె చేస్తున్న చిరుద్యోగమే నలుగురి పొట్టలు నింపుతోంది. ఆస్తిపాస్తులంటూ ఏమీలేని ప్రసన్న రేపటి సంగతేమిటో తెలీక అల్లాడుతోంది. ప్రసన్నకు ఈ పరిస్థితి ఎందుకొచ్చిందంటే...
ఏడాది క్రితంవరకూ అంతా బాగానే ఉండేది. ప్రసన్న కాపురం చూడచక్కని కాపురమే. ఆమె పెళ్లయి పదేళ్లు. భర్త సుధాకర్‌ది ప్రభుత్వోద్యోగం. ఆడిపాడే ముగ్గురు పిల్లలు. సుధాకర్ ఇంట్లోకి అన్నీ సమకూర్చేవాడు. భార్యాబిడ్డలను చూసుకోవడంలోనూ ఏ తేడా ఉండేదికాదు. భరతగడ్డపై సామాన్య స్త్రీకి ఇంతకంటే మరింకేం కావాలి?! ఆరకంగా ప్రసన్న సంతోషంగా ఉన్నట్లే! 'భార్య అన్ని విషయాలు అడగకూడదు. ఆమె సలహాలు, జోక్యం అన్నిటా ఉండకూడదు'... లాంటి భర్త అభిప్రాయాల్లో ప్రసన్నకు ఎలాంటి అభ్యంతరాలూ కనిపించలేదు. కారణం ఇవన్నీ అతి సహజం అనుకునే సాధ్వీమణి ఆమె. అందుకే భర్తే తన ప్రపంచం, పిల్లలే తన లోకంగా జీవించేది. పొద్దున్న లేచింది మొదలు రాత్రి నడుంవాల్చే వరకూ కుటుంబంకోసం నిర్విరామంగా తపించేది. ముఖ్యంగా సుధాకర్‌కు ఏలోటూ రాకుండా చూసుకునేది. కాఫీ కప్పు మొదలు, కర్చీఫ్ వరకూ అన్నీ చేతికి అందించేది.
ఉన్నట్లుండి ఆ కుటుంబంలో పెనుమార్పు చోటుచేసుకుంది. సుధాకర్ మునుపుకన్నా ఎక్కువ ఉత్సాహంగా ఉంటున్నాడు. ఒకటికి నాలుగుసార్లు అద్దంలో చూసుకుంటున్నాడు. పౌడర్లు, అత్తర్లూ పూసుకుంటున్నాడు. ఇదంతా ప్రసన్నకు విచిత్రంగా అనిపించినా పట్టించుకోలేదు. కానీ సుధాకర్ భార్యాబిడ్డలను కసురుకుంటున్నాడు. పిల్లలు గారంగా దగ్గరకు చేరబోతే విదిల్చేస్తున్నాడు. ప్రసన్న ప్రేమగా పలకరించబోతే పట్టించుకోవడంలేదు. ఈ మార్పుకు కారణం ప్రసన్న ఆఫీసులో పనులు అనుకుంది. కుటుంబానికి భర్త దూరమవుతున్న భావన మనసులో చూచాయగా రాబోయినా దాన్ని తొక్కిపెట్టేసింది. అతనికి అనువుగా మసలుకోవడమే మంచిదనుకుంది.
అయితే, ఒకరోజు ప్రసన్నకు నిజం తెలిసింది. ప్రసన్న జీవితంలో తుఫాను చెలరేగింది. సుధాకర్ ఉత్సాహానికి కారణం మరో మహిళ ఉత్పల. ఇది విన్న ప్రసన్నకు భూమి బద్దలైనట్లు, తాను అందులో కూరుకుపోతున్నట్లు అనిపించింది. ఆ సాయంత్రం భర్తరాగానే నిలదీసింది. 'నువ్వు విన్నది నిజమే! నేను ఆమెను పెళ్లాడాలనుకుంటున్నాను' అన్న భర్తవంక పిచ్చిదానిలా చూసింది. నేను, పిల్లలు ఏమైపోవాలంటూ కుళ్లి కుళ్లి ఏడ్చింది. 'మీకేం లోటుచేయను. నా దారికి అడ్డంరాకు' శాసనం చేసిన మగమహారాజును చూసి నివ్వెరపోయింది.
అన్నట్లుగానే సుధాకర్ ఉత్పలను రెండో పెళ్లి చేసుకున్నాడు. నెలకోసారి వచ్చి వందో, రెండొందలో ప్రసన్న చేతిలో పెట్టేవాడు. ఏడుస్తూ కూర్చుంటే రోజులు గడవవు. అందుకే, ఏనాడూ గుమ్మందాటని ప్రసన్న చిరుద్యోగం చూసుకుంది. వచ్చే డబ్బులతోనే ఇల్లు గడపసాగింది. ముగ్గురు పిల్లలతో భార్య ఎలా ఉంటోందన్న ఆలోచన సుధాకర్‌కి లేదు. పైపెచ్చు ఓరోజు ఉరుములేని మెరుపులా ఊడిపడ్డాడు. వచ్చీరావడంతోనే పెళ్లాం నగలన్నీ దౌర్జన్యంగా తీసుకుని వెళ్లిపోయాడు. ప్రసన్న భర్తను అడ్డుకోవాలని ప్రయత్నించినా సాధ్యంకాలేదు.
సహనం నశించిన ప్రసన్న 'ఐద్వా లీగల్‌సెల్'కు వచ్చింది. ఆకర్షణలో కొట్టుకుపోతున్న భర్తకు తగిన బుద్ధి చెప్పమని కోరింది. సభ్యులు సుధాకర్‌ను పిలిపించారు. వ్యామోహంలో మునిగితేలుతున్న సుధాకర్‌కు విచక్షణ నేర్చుకోమన్నారు. కుటుంబ విలువల గురించి విడమర్చి చెప్పారు. తాత్కాలిక సుఖాలను వెతుక్కోవడమంటే... బాధ్యత మర్చిపోవడమంటే మనిషిగా విఫలమైనట్లేనన్నారు. పిల్లల్ని కనగానే సరిపోదు, పెంచడమూ ముఖ్యమే. అలాగే పిల్లలు సమాజంలో తలెత్తుకు బతికేలా చేసే బాధ్యతా తండ్రిదేనన్నారు. సుధాకర్‌కు తాను చేస్తున్న పొరపాటేంటో తెలిసింది. ఇక సరిదిద్దుకోవడం ఎంతసేపు?!
YEAH...YOU ARE RIGHT....BUT WE ALSO SHOULD SEE THE OTHER SIDE OF THE COIN....WHAT MADE SUDHAKAR TO LEAVE HER WIFE..WHAT HE LOST WITH HER AND WHAT HE GOT WITH UTPALA? SOMETHING SHOULD BE THERE...I M NOT SUPPORTING SUDHAKAR BUT THERE IS SOMETHING MISSING...WASSTHAT???
ReplyDelete