Monday, December 19, 2011

మీల్‌ మేకర్‌ ఫ్రాంకీస్‌

కావలసిన పదార్థాలు చపాతీలు - 4, మీల్‌ మేకర్‌ - 100 గ్రా, టమాటాలు - 5, క్యాప్సికమ్‌ - 4, అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టేబుల్‌ స్పూన్‌, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 5, ఉప్పు - తగినం, కారం - తగినంత, పసుపు -................. చిటికెడు, నిమ్మకాయ - 1, నూనె - 2 టీ స్పూన్లు, తాలింపు గింజలు - 2 స్పూన్లు
తయారు చేసే విధానం
మరిగే నీళ్లల్లో మీల్‌ మేకర్‌ వేసి స్టౌ కట్టేసి మూత పెట్టాలి. పది నిమిషాలు ఉంచి అందులో నీళ్లు పిండాలి. టమాటాలు, క్యాప్సికమ్‌ ముక్కలు కోసుకోవాలి. బాండీలో కొద్దిగా నూనె వేసుకుని కాగాక తాలింపు గింజలు వేయించుకోవాలి. అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపాలి. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌ వేసి వేయించాలి. అందులోనే టమాటా, క్యాప్సికమ్‌ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేయాలి. ఈ మిశ్రమాన్ని కలియదిప్పి ఉడికించాలి. అంతే కూర తయారైనట్టే. చపాతీపై మీల్‌మేకర్‌ కూరని ఒక పక్క నిలువుగా వేసుకోవాలి. నిమ్మరసాన్ని ఒక గిన్నెలో పిండి అందులో కొద్దిగా నీళ్లు కలపాలి. ఈ నిమ్మకాయ నీళ్లని కూరపైన కొద్దగా వేసుకుంటే చాలు( నిమ్మరసం ఎక్కువ పిండుకుంటే పులుపు ఎక్కువై రుచి ఉండదు). దీన్ని రోల్‌లా చుట్టుకుంటే మీల్‌ మేకర్‌ ఫ్రాంకీస్‌ రెడీ.

1 comment:

  1. US veetini barrito's antaru....any thing wrapped in chapathi

    ReplyDelete