Saturday, December 17, 2011

హెర్బల్స్‌ వాడకంతో ఓరల్ క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చట!

మీ ఇంట్లో లవంగం, ఏలకులు, దాల్చిన చెక్కలున్నాయి కదా.. వీటిని మితంగా వంటకాల్లో చేర్చుకుంటే ఓరల్ క్యాన్సర్,..............మౌత్ క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. నోటిలోని బ్యాక్టీరియాలు, ఫంగల్ ఇన్ఫెక్షన్లను నియంత్రించే ఈ హెర్బల్స్ ఓరల్ క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చునని రొహ్టాక్ పరిశోధన బృందం తెలిపింది.

ఖర్జూరం, దాల్చిన చెక్కలు, కస్టర్ ఆయిల్, మెంతులు వంటి హెర్బల్స్‌తో నోటి క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చునని డాక్టర్ జయప్రకాశ్ యాదవ్ చెప్పారు. ఈ హెర్బల్స్‌లో వైద్య గుణాలెన్నో దాగివున్నాయి.

వీటిని వంటల్లో ఉపయోగించడం ద్వారా నోటిపూత, నోటకి సంబంధించిన వ్యాధులు నయం అవుతాయని డాక్టర్ జయప్రకాష్ యాదవ్ తెలిపారు. వీటిలో ఆంటిబయోటిక్స్ ఉండటం చేత నోటికి సంబంధించిన వ్యాధులను దూరం చేస్తానని జయప్రకాష్ అన్నారు.

No comments:

Post a Comment