Thursday, December 8, 2011

శీతాకాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోతుంటుంది... కారణం?

ఈ కాలంలో చుండ్రుకు అవకాశాలు ఎక్కువ. ఈ కారణంగా జుట్టు ఎక్కువ శాతం రాలిపోతుంటుంది. జుట్టు ఈ వాతావరణానికి పేలవంగా, రఫ్ గానూ తయారవుతుంది................ తేలికపాటి షాంపూలు కొద్దిగా మాత్రమే ఉపయోగించాలి. కఠినమైన షాంపూలు శిరోజాల్లోని సహజమైన నూనెల్ని హరించివేస్తాయి.

అలాగే బాగా వేడి నీటిని తలపై పోసుకోకూడదు. షాంపూ చేసుకున్న తర్వాత కండీషనర్ అప్లై చేయాలి. లేదా కండిషనర్ కలిపి ఉన్న షాంపూను ఎంచుకోవాలి. హెయిర్ డ్రయర్ ను జుట్టుకు కనీసం పది అంగుళాల దూరంలో ఉంచాలి. అసలు వాడకుండా ఉంటే ఇంకా మంచిది. వారానికి రెండుసార్లు తలకు నూనె పెట్టుకుని, ఆ నూనెను రాత్రంతా అలా ఉంచేయాలి.

వారానికి రెండుసార్లు పెరుగు లేదా గుడ్డులోని పచ్చసొన పొడి జుట్టుకు అప్లై చేస్తే కేశాలు మృదువుగా ఉంటాయి. కొబ్బరి నూనె, నువ్వులు లేదా ఆలివ్ ఆయిల్ కలిపి వేడి చేసి మాడుకు, శిరోజాలకు పట్టించి వేడి నీటిలో ముంచిన టవల్ తలకు చుట్టుకోవాలి. ఐదు నిమిషాలుంచి, మరోమారు టవల్ ను వేడి నీటిలో ముంచి చుట్టుకుని కొద్ది నిమిషాలు ఉంచుకోవాలి. ఇలా చేయడం ద్వారా మాడు నూనెను బాగా గ్రహిస్తుంది. పొడిగా, పేలవంగా జుట్టు ఉన్నట్లయితే ఒక కప్పు తేనె, అరకప్పు ఆలివ్ ఆయిల్ లేదా నువ్వుల నూనె, రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం కలిపి ఓ రాత్రంతా ఉంచేసి కొద్దిగా తీసుకుని తలకు మసాజ్ చేయాలి. వేడి టవల్ చుట్టుకుని కొద్దిసేపు షాంపూ చేసుకోవాలి. జుట్టు పొడిగా, దెబ్బతిని ఉన్నట్లయితే ఒక టీస్పూన్ ఆముదం, రెండు స్పూన్లు స్వచ్ఛమైన ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెను కలిపి మసాజ్ చేసుకుని వేడినీటి టవల్ చుట్టి ఆపై స్నానం చేయాలి.

No comments:

Post a Comment