నటీనటులు: ప్రభు, అజయ్, నాగచైతన్య, అమలాపాల్, బ్రహ్మానందం, ముకుల్‌దేవ్, అభిమన్యుసింగ్, సత్యప్రకాష్, అంజనాసుఖాని, శుభలేఖ సుధాకర్, ఎం.ఎస్.నారాయణ తదితరులు .........................
నిర్మాతలు: రామ్‌గోపాల్ వర్మ, కిరణ్‌కుమార్ కోనేరు.
బేనర్: శ్రేయ ప్రొడక్షన్స్,దర్శకత్వం:వివేక్ కృష్ణ. పాయింట్: బెజవాడ అనే ఊరిలో దందాలుచేసే అన్నదమ్ముల కథ.
ఈ సినిమా తీయడానికి ముందు విజయవాడకు చెందిన పండు అనే వ్యక్తి హైదరాబాద్ యూసఫ్‌గూడలో హత్యచేయబడ్డాడు. ఆ వెంటనే తను బెజవాడ రౌడీలు అనే టైటిల్‌లో సినిమా తీస్తున్నట్లు రామ్‌గోపాల్‌వర్మ ప్రకటించాడు. దాంతో ప్రాజెక్ట్‌కు ఒక క్రేజ్ ఏర్పడింది. టీవీలు, ప్రింట్ మీడియా అంతా వర్మకు నెగెటివ్‌గా ప్రచారంచేస్తూ సినిమాకు బోల్డండ్ హైప్ తెచ్చేశారు.
మీడియాను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు గనుక... విజయవాడకు వెళ్లినప్పుడల్లా, రంగా, నెహ్రూ అనుచరుల్ని కలవడం మరో క్రేజ్ ఏర్పడింది. చివరికి ఇరువర్గాలవారు గొడవ చేయడంతో సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే... ఇండస్ట్రీలో వర్మ గురించి తెలియనివారు లేరు.
ఇదంతా ఓట్రాష్‌గా... కేవలం బెజవాడను క్యాష్‌చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నారనే రూఢీకి వచ్చేశారు. ఈ సినిమా చూశాక రూఢీ నిజమైంది. కేవలం ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని తనవైపు మార్చుకునే అలవాటులో ఉన్న వర్మ చేసిన జిమ్మిక్కు ఈ చిత్రం.
కథలోకి వెళితే...
బెజవాడ ప్రజలకు దమ్మున్నవ్యక్తిగా కాళీప్రసాద్ (ప్రభు) పేరు. తన వద్దకు వచ్చిన ఎంతోమందికి తగిన పరిష్కారం చేస్తుంటాడు. మరోవైపు కాస్త స్వార్థం ఎక్కువతో కాళీవర్గానికి వ్యతిరేకంగా మరో వర్గ ప్రతినిధి సత్యప్రకాష్ ఎదిరించి ప్రాణాలు కోల్పోతాడు. కాళీకి అనుంగు శిష్యుడు, స్వంత తమ్ముడు శంకరప్రసాద్ (అభిమన్యుసింగ్) కంటే ఎక్కువయిన విజయకృష్ణ (ముకుల్‌దేవ్) ప్రతి పనిని చేస్తుంటాడు. తనకంటే పేరుతెచ్చుకుంటున్న విజయకృష్ణపై శంకరప్రసాద్ కసిపెంచుకుంటాడు.
విజయకృష్ణ సోదరుడు జయకృష్ణ (అజయ్) పెండ్లికి కాళీ హాజరయినప్పుడు బాంబుదాడిచేసి కత్తులతో చంపింస్తాడు శంకరప్రసాద్. ఈ హత్య విజయకృష్ణ చేశాడని ఊరిలో ప్రచారం చేయిస్తాడు. ఆ తర్వాత తన ఎదుగుదలకు అడ్డువస్తున్నాడని విజయకృష్ణను చంపిస్తాడు. కళ్ళెదుటే ఇది చూసిన విజయకృష్ణ మరో సోదరుడు శివకృష్ణ (నాగచైతన్య) తన అన్నను చంపినవారిపై కక్షపెట్టుకుంటాడు.
మరోట్రాక్‌లో పోలీసుకమీషనర్ ఆహుతిప్రసాద్ కుమార్తె గీతాంజలి (అమలాపాల్) శివకృష్ణను ప్రేమిస్తుంది. మరి ఆమె ప్రేమ శివకృష్ణ ప్రేమపొందాడా? పగ తీర్చుకున్నాడా? అన్నది సినిమా.
బెజవాడ సినిమా అంటే.. కత్తులు, బాంబులు దాడులతో ఒకరినొకరు చంపుకుంటారనేది ఒకప్పటి చరిత్ర. ఆ చరిత్ర ఇలా ఉంటుందని తన పాత చిత్రాల ధోరణిలో రక్తచరిత్ర తరహాలో సినిమా తీశాడు దర్శకుడు వివేక్‌కృష్ణ. ఇతను వర్మ దగ్గర కొద్ది సినిమాలకు పనిచేశాడు. ఈ చిత్రంలో నటించిన పాత్రలు అలా చేశారు. ఇలా చేశారు.. అంటూ పెద్దగా చెప్పుకోవక్కర్లేదు. సీరియస్ మూవీలో పాత్రలన్నీ సీరియస్‌గా చూస్తే సరిపోతుంది.
కోట శ్రీనివాసరావు మేకవన్నెగల రాజకీయనాయకులా జీవించాడనేది పాతమాటే. ప్రభు పాత్ర పరిమితం. ఇతర పాత్రలన్నీ తమ కథకు సరిపడినట్లుగా ఉన్నాయి. నమ్మినబంటుగా ముకుల్‌దేవ్ బాగా చేశాడు. లోపల ఈర్షతో రగిలిపోయే పాత్రలో అభిమన్యుసింగ్ బాగా చేశాడు. అతని పాత్ర చూస్తుంటే.. రక్తచరిత్రే గుర్తుకువస్తుంది.
అమలాపాల్ పాత్ర కేవలం ప్రేమట్రాక్‌తో ప్రేక్షకుల్ని రిలీఫ్‌చేయడానికే ఉపయోగించుకున్నారు. స్కెచ్‌పాపారావుగా బ్రహ్మానందం పాత్ర రొటీన్‌గా ఉంది. ఎం.ఎస్. నారాయణకు పెద్దగా ప్రాధాన్యతలేదు. అజయ్ పాత్ర బాగానే ఉంది.
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వర్మ పాత చిత్రాలన్నీమిక్స్ చేశాడు. ఈ చిత్రానికి నలుగురు సంగీత దర్శకులు పనిచేశారు. ఒక్కోపాట వైవిధ్యంగా ఉంటుందని దర్శకుడు మొదట్లోనే చెప్పాడు. బెజవాడ.. అంటూ దుర్గమ్మపై వచ్చే టైటిల్‌సాంగ్ పెద్దగా ఆకట్టుకోలేదు. మిగిలిన పాటలు డిటో.. బెజవాడలో పుట్టిపెరిగి అభిమానాన్ని అనువనువుగా నింపుకున్న విద్యార్థిగా నాగచైతన్య నటించాడు.
ఆవేశం, ఆనందం, విషాదం వంటి సన్నివేశాల్లోనూ హావభావాలు ఒకేలా ఉంటాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అతని చూపుకు తోడయింది. ఒకరకంగా చెప్పాలంటే నాగచైతన్య ఈ చిత్రానికి సూట్‌కాలేదు. ఇంకా పవర్‌ఫుల్‌గా చేయాల్సింది.
ఈ సినిమా చూశాక బెజవాడ రౌడీలకుకూడా ఈ కథ ఎవరిదో అర్థంకాదు. రాధా, గాంధీలు తరంలోని కాకానివెంకటరత్నం అనే వ్యక్తి ఉండేవాడు. అతని కథకు కొంచెం దగ్గరగా ఉన్నట్లు అనిపించినా అదీకూడా సరిగ్గాలేదు.
వ్యాపారవేత్త సాయిరాజు అనే పాత్రలో సుభలేఖ సుధాకర్ నటించాడు. అతని పాత్ర ఇంచుమించుగా సిరీస్‌రాజు అనే వ్యాపారస్తుని పాత్రను పోలుస్తూ ఉంటుందనిపించేలా ఉంది. టోటల్‌గా జెజవాడ రౌడీలు అనే టైటిల్ పెట్టి.. ఆ తర్వాత బెజవాడ అని మార్చి... ఇలా రకరకాల జిమ్మిక్కులతో రొటీన్ కథను తీసిన వర్మకు ఆంధ్రప్రేక్షకులంటే ఎంత చులకనో తెలిసిపోయింది.
గురువారం రిలీజ్ అయినా.. కొన్నిచోట్ల ఇంకా ప్రసాద్‌ల్యాబ్స్ నుంచి మధ్యాహ్నం వరకు ప్రింట్లు వెళుతునే ఉన్నాయి. చిత్రంలో సన్నివేశంలో తర్వాత ఏమిటో ఇట్టే తెలిసిపోతుంది. స్క్రీన్‌ప్లే చాలా చీప్‌గా ఉంది. ఇటువంటి తరహా చిత్రాలు తీసి ఇంకా వర్మ ప్రేక్షకుల్ని ఎంతకాలం మోసగిస్తాడో వారే చెప్పాలి.

No comments:
Post a Comment