ఉసిరికాయలు - కిలో
ఉప్పు - పావు కిలో....................................
కారం - పావు కిలో
నిమ్మకాయలు - 10
ఆవపిండి -50 గ్రా
మెంతిపిండి - 50 గ్రా
నూనె - అర కిలో
పసుపు - 1 టేబుల్ స్పూను
వెల్లుల్లి - 50 గ్రా
తయారు చేసే విధానం
ఉసిరికాయల్ని కడిగి తడి లేకుండా తుడిచి కాయల అరలమీద గాట్లు పెట్టుకోవాలి. వాటిని నూనెలో సన్న సెగమీద వేయించాలి. కాయల్ని చల్లార్చి తొనలు వలిచి పక్కన పెట్టుకోవాలి. ఈ తొనలకి కారం, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, నిమ్మరసం, మెంతి పిండి, ఆవపిండి కలిపి తాలింపు పెట్టుకోవాలి.
No comments:
Post a Comment