ప్రముఖ నటి సుజాత బుధవారంనాడు చెన్నైలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. కథానాయడు చిత్రంతో తెలుగులో అరంగేంట్రం చేసిన ఆమె దాదాపు 300 చిత్రాల్లో నటించారు. శ్రీలంకలో 1952లో జన్మించిన ఆమె మాతృభాష మలయాళం. దక్షిణాది భాషలన్నింటిలోనూ ఆమె నటించింది. శోభన్‌బాబు, అక్కినేని నాగేశ్వరరావుతో ఎక్కువ చిత్రాల్లో నటించారు. దాసరి దర్శకత్వంలో 'గోరింటాకు' ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అక్కినేనితో 'అనుబంధం', ఏడంతస్తుల మేడ, ఎన్టీఆర్‌తో సర్కస్ రాముడు, సంధ్య సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. 2006లో శ్రీరామదాసులో దమ్మక్క పాత్ర పోషించి మెప్పించారు.
"మా" సంతాపం
సుజాత ఆకస్మిక మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంతాపాన్ని తెలియజేసింది. మురళీమోహన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇటీవలే నూతన్‌ప్రసాద్‌ను ఇండస్ట్రీ కోల్పోయింది. పలు భాషల్లో నటించిన సుజాత మరణం మర్చిపోలేని సంఘటనగా పేర్కొన్నారు.
దాసరి నారాయణరావు
ఏడంతస్తులమేడ చిత్రంలో ఆమె నటించిన తీరు అబ్బుర పర్చింది. తనకిచ్చిన పాత్రల్లో ఆమె జీవిస్తుంది. దుఃఖాన్ని పండించే సన్నివేశాల్లో ఆమె నటన అమోఘం. భగవంతుడు ఈ రకంగా ఆమెను తీసుకెళ్ళడం బాధకల్గించింది అన్నారు.

No comments:
Post a Comment