Wednesday, April 6, 2011

కొబ్బరి బొబ్బట్లు

కావలసిన పదార్థాలు
కొబ్బరి చిప్పలు - రెండు
మైదా - పావుకిలో
చక్కెర లేదా బెల్లం - 1 కప్పు
నూనె - తగినంత
యాలకులు - ఆరుతయారు చేసే విధానం
కొబ్బరి చిప్పలు తురుముకోవాలి. చక్కెర లేదా బెల్లంలో కొద్దిగా నీళ్లు పోసి స్టౌమీద పెట్టాలి. కొద్దిగా కరిగిన తర్వాత కొబ్బరి తురుము అందులో కలపాలి. తీగ పాకం వచ్చేవరకు అంటే మొత్తం దగ్గరకు వచ్చేవరకు కలియదిప్పాలి. చివరిలో యాలకుల పొడి వేసి కలిపి స్టౌమీద నుండి దింపెయ్యాలి. ఇది చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. మైదాను పూరీ పిండిలా కలిపి రెండు గంటలు నానబెట్టాలి. ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న పూరీల్లా వత్తుకోవాలి. అందులో తయారు చేసుకున్న ఉండను పెట్టి పూరీల్లా వత్తాలి. పెనం మీద బొబ్బట్లలాగా కాల్చాలి. ఇవి రుచిగా వుండడమే కాదు రెండు, మూడు రోజులు నిల్వ కూడా వుంటాయి.

రవ్వ బొబ్బట్లు
కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ - పావు కిలో
పంచదార - పావుకిలో
యాలకుల పొడి - 1 చెంచా
నీళ్లు - 2 గ్లాసులు
మైదా - పావు కిలో, నెయ్యి - తగినంత
తయారు చేసే విధానం
మైదా పిండిలో నీళ్లు, ఉప్పు వేసి పూరీపిండిలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. బొంబాయి రవ్వ, నీళ్లు, పంచదార కలిపి స్టవ్‌ మీద పెట్టి ఉండకట్టకుండా కలుపుతూ ఉండాలి. బాగా ఉడికిన తరువాత దించి, చల్లారాక ఉండలు చేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న మైదాతో అరచేయంత పూరీలు చేసుకోవాలి. రవ్వ ముద్దను అందులో పెట్టి చుట్టూ పిండితో కవర్‌ చెయ్యాలి. ప్లాస్టిక్‌ కవర్‌ పై నూనె రాసి ఆ ముద్దను చపాతీలా ఒత్తుకోవాలి. వీటిని నెయ్యి వేసి పెనం మీద కాల్చుకోవాలి.

1 comment:

  1. కొబ్బరితో కూడా చేస్తారా? బాగుందండి.

    ReplyDelete