Thursday, April 7, 2011

వెజిటబుల్‌ పులిహోర



కావలసిన పదార్థాలు
బియ్యం - అరకిలో
క్యారెట్‌ ముక్కలు - 1 కప్పు
బంగాళదుంప ముక్కలు - 1 కప్పు
క్యాప్సికమ్‌ ముక్కలు - అరకప్పు
దొండకాయలు - 3
బీట్‌రూట్‌, క్యాబేజీ, పచ్చిబఠాణీ,
బీన్స్‌ ముక్కలు - 3 కప్పులు
పచ్చిమిర్చి - 4

ఎండు మిర్చి - 4
నిమ్మకాయ రసం - పులుపు సరిపడా
ఇంగువ - చిటికెడు
పోపు సామాను - 3 స్పూన్లు
పల్లీలు - 2 స్పూన్లు
పసుపు - కొద్దిగా
ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం
అన్నం ఒక పొంగు వచ్చాక తరిగిపెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ కలిపి ఉడకనివ్వాలి. అన్నం, కూరగాయ ముక్కలు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పొడిగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత దీన్ని వెడల్పాటి బేసిన్‌లో వేసి పసుపు, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, నూనె కలపాలి. పల్లీలు, మిగతా పోపు సామానుతో తాలింపు వేసుకుని అన్నంలో కలుపుకోవాలి. అంతే వెజిటబుల్‌ పులిహోర రెడీ.

No comments:

Post a Comment