125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర అని చెప్పుకునే జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి కడప లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థి దొరకలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న కందుల రాజమోహన్ రెడ్డి సోదరులు ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి డీఎల్.రవీంద్రా రెడ్డినే అభ్యర్థిగా ఎంపిక చేసే పరిస్థితి ఏర్పడింది. వచ్చే నెల ఎనిమిదో తేదీన జరుగనున్న ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ఈ స్థానం నుంచి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనపై బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ పార్టీకి ఒక్క అభ్యర్థి కూడా దొరకని దుస్థితిలో అధికార పార్టీ కొట్టుమిట్టాడుతోంది.
చివరికి తెదేపా నుంచి సాదరంగా ఆహ్వానించిన కందుల బ్రదర్స్ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజ్యసభకు పంపించాలన్న షరతు విధించారు. దీనికి ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీ రాలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనై, పోటీ చేయం పొమ్మనడంతో కాంగ్రెస్ కుదేలైపోయింది.
ఫలితంగా దిక్కుతోచని కాంగ్రెస్ చివరకు తాను పోటీ చేయనంటూ ఆది నుంచీ మొత్తుకుంటున్న మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి మెడకే కడప గంటను కట్టింది! ఇక మరో దిక్కు లేని పరిస్థితుల్లో ఆయననే బరిలో దించాలని నిర్ణయించింది. ఆ మేరకు డీఎల్ సమక్షంలోనే పార్టీ అధిష్టానానికి సీఎం కిరణ్ గురువారం రాత్రి ఫ్యాక్స్ కూడా పంపినట్టు తెలిసింది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం నేడో రేపో స్పష్టమైన ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

No comments:
Post a Comment