Saturday, April 16, 2011

గ్రేప్‌ జింజర్‌ ఆలె

కావలసిన పదార్థాలు
ద్రాక్ష - 1 కప్పు, యాపిల్‌ - 1, ఐస్‌ ముక్కలు - సరిపడినన్ని
అల్లం - చిన్న ముక్క, నిమ్మరసం - 2 టీ స్పూన్లు

తయారు చేసే విధానం
ద్రాక్ష పళ్లను పై తోలు తీసి మెత్తని గుజ్జులా చేసుకోవాలి. ఆపిల్‌ చెక్కుతీసి ముక్కలు కోసుకోవాలి. ద్రాక్షగుజ్జు, యాపిల్‌ ముక్కలు, అల్లం ముక్కలు కలిపి మిక్సీలో వేయాలి. ఈ మిశ్రమానికి నిమ్మరసాన్ని కలిపి దానికి సరిపడినన్ని నీళ్లు కలిపి, ఐస్‌ ముక్కలు వేసి తాగేయండి. తీపి ఎక్కువ కావాలనుకునేవారు 2 స్పూన్ల పంచదార వేసుకోవచ్చు.

No comments:

Post a Comment