భారత క్రికెట్ జట్టును విజయపథాన నడిపి 28 ఏళ్ల అనంతరం ప్రపంచకప్‌ను సాధించిపెట్టిన టీమిండియా కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ ఈరోజు విలేకరులతో ఓ వీడ్కోలు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీమిండియాను వీడటం తనకు అత్యంత బాధాకరమైన విషయమని అన్నాడు. ఇది తనకు అత్యంత భారమైన వీడ్కోళ్లలో ఒకటని అన్నాడు. ప్రపంచ విజేతల జట్టులో భాగస్వామి కావటం తనకు గర్వకారణంగా ఉందన్నాడు. ప్రస్తుతం వారు ప్రపంచంలో నంబర్‌వన్ టీమ్‌గా ఉన్నారని వారు తమ ఆటతీరును ఎక్కువగా మెరుగుపరుచుకోవలసిన పరిస్థితిలో లేరని కిర్‌స్టన్ అన్నారు. వారితో తనకున్న జ్ఞాపకాలు గుర్తుగా మనసులో దాచుకుంటానని అన్నాడు. తాను వెళ్లిపోయినా తన హృదయం ఈ దేశంలోను, ఈ ప్రజల వద్దే ఉంటుందని అన్నాడు. ఓ ఆటగాడికి ప్రపంచకప్ గెలవటం ఎంత గర్వకారణమో ఓ కోచ్‌కు కూడా అంతే గర్వకారణమని అన్నాడు. ఆటగాళ్ల సహకారం వల్లనే ఇది సాధ్యమైందని, తాను ధోనిలాంటి గొప్ప కెప్టెన్‌ను ఇంతవరకు చూడలేదని అన్నాడు.
No comments:
Post a Comment