Monday, March 28, 2011

అమెరికాలో దండియాత్ర

మహాత్మ గాంధీ దండియాత్ర స్ఫూర్తితో అమెరికాలో ఎన్నాకరైలు దండియాత్ర -2 నిర్వహించారు. భారతదేశంలో అవినీతికి వ్యతిరేకంగా ప్రచారం చేసే కార్యక్రమంలో భాగంగా వారు ఈ యాత్ర చేపట్టారు. ఇది అమెరికాలోని పది రాష్ట్రాలలో సాగింది. ఒక కాలిఫోర్నియాలోనే పది ప్రధాన ప్రాంతాలలో సాగింది. ఈ దండియాత్ర శాన్‌ ప్రఫాన్సిస్కోరలోని గాంధీ విగ్రహం వద్ద మార్చి 26న తేదీన ముగిసింది. ఈ యాత్ర మార్యి 12వ తేదీన ప్రారంభమైంది. జనహర్‌ కంభంపాటి, శ్రీహరి అట్లూరిల నేతృత్వంలోని రోజుకు 240 మైళ్ల యాత్ర 15 రోజుల పాటు సాగింది.
కామన్‌వెల్త్‌ క్రీడలు, ఆదర్శ హౌసింగ్‌, మైనింగ్‌ లీజుల కుంభకోణాల వంటి అవినీతి కార్యక్రమాల నేపధ్యంలో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ ఈ యాత్ర సాగింది. అవినీతిని అనిరిటకట్టడానికి జన్‌ లోక్‌పాల్‌ బిల్లు తేవాలని వారు డిమండ్‌ చేశారు. కపర్షన్‌ కో హటాని హై.. భారత్‌ కో బచావానా హై వంటి నినాదాలు చేశారు. దండియాత్ర ముగింపు కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎన్నారైలు హాజరయ్యారు. ఈ దండియాత్ర ముగింపు సంధర్భంగా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

No comments:

Post a Comment