హాసన్ అలీనా.. ఆయనెవరో నాకు తెలియదే: చిరంజీవి
దేశంలో పన్ను ఎగవేతదారుల్లో అగ్రగణ్యుడైన హాసన్ అలీ పేరు ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా మార్మోగి పోతోంది. అయితే, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి మాత్రం ఆయనెవరో కూడా తెలియదట. ఆయన పేరు కూడా వినలేదట. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు సినీహీరోలు, ప్రాంతీయ పార్టీలకు నల్లధనం అక్రమలావాదేవీలకు మధ్యవర్తిగా ఉన్నట్టు హాసన్ అలీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ విచాణలో వెల్లడించినట్టు సమాచారం. దీనిపై మెయిల్ టుడే ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ ప్రకారంగా చిరంజీవికి హాసన్ అలీతో సంబంధం ఉన్నట్టు ఆ కథనం సారాంశంగా ఉంది.
దీనిపై చిరంజీవి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తనకు కేవలం సినిమాలు మాత్రమే తెలుసునన్నారు. హసన్ అలీ గురించి తనకేమీ తెలియదని, ఆయనెవరో కూడా మీరే చెప్పాలన్నారు. పైపెచ్చు హసన్ అలీకి రాజకీయ ప్రముఖులతో ఉన్న సంబంధాలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆంగ్లపత్రిక మెయిల్ టుడేలో పేర్కొన్న వారిలో మన రాష్ట్రానికి చెందిన ఓ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతతో పాటు ఇటీవలే రాజకీయాలలో చేరిన ప్రముఖ హీరో, హీరోయిన్, పలువరు సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది.
No comments:
Post a Comment