కానుకోండి మగరాయుళ్లారా
ముడుచుకుంటూ పాకుతూ ఉన్న గొంగళి పురుగు దశనుంచి
ఎర్ర సీతాకోక చిలుకలమై ఎగిరి వస్తున్నాం
మందుపాతరలమై పైకి లేస్తున్నాం
పోరాటపు వేటకు నడిచి వస్తున్నాం
తరతరాల బానిసత్వాన్ని తెంచుకోని
ముడుచుకుంటూ పాకుతూ ఉన్న గొంగళి పురుగు దశనుంచి
ఎర్ర సీతాకోక చిలుకలమై ఎగిరి వస్తున్నాం
మందుపాతరలమై పైకి లేస్తున్నాం
పోరాటపు వేటకు నడిచి వస్తున్నాం
తరతరాల బానిసత్వాన్ని తెంచుకోని
పాతవ్రత్యపు పరదాలు చించుకొని
పోరబాటల్లో స్వేచ్ఛాపతాకాల్ని ఎగురవేస్తాం
పోరుబాటల్లో జండాకర్రలపై మా కరవాలాలాలతో కవాతు చేస్తాం
వాత్సాయన కామసూత్రాల్ని మీతోనే తిరగరాయించి
ఆడదానికి అసలైన అర్థం చెప్పిస్తాం
తరతరాలుగా మ రక్తంతో తడిసిన పైటకొంగుల్ని
అంతర్జాతీయ మహిళా దినోత్సవ విజయపతాకాలుగా ఎగురవేస్తాం
అరుణ పతాకాలమై మెరుస్తాం.............
మార్చి 8 కొంతమంది మహిళల దృష్టిలో 'మహిళ ఉత్సవ దినం' మరికొంతమంది దృష్టిలో 'మహిళా పోరాట దినం', సిగిరిగా చెప్పాలంటే 'అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరట దినం',పోరుబాటల్లో జండాకర్రలపై మా కరవాలాలాలతో కవాతు చేస్తాం
వాత్సాయన కామసూత్రాల్ని మీతోనే తిరగరాయించి
ఆడదానికి అసలైన అర్థం చెప్పిస్తాం
తరతరాలుగా మ రక్తంతో తడిసిన పైటకొంగుల్ని
అంతర్జాతీయ మహిళా దినోత్సవ విజయపతాకాలుగా ఎగురవేస్తాం
అరుణ పతాకాలమై మెరుస్తాం.............
సిగిరిగ్గా ఈ రోజుకి 101 సంవత్సరాల క్రితం అంటే 1910లో కోపెన్ హేగన్‌లో రెండవ సోషటిస్టు అంతర్జాతీయ మహాసభ జరిగింది. మార్చి 8న అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంగా పాటించాలని జర్మన్ సోషలిస్టు క్లారా జట్కిన్ ఆ మహాసభలోనే ప్రతిపాదించింది. అనాటినుంచి ప్రపంచవ్యాప్తంగా శ్రామిక మహిళలు అంతర్జాతీయ మహిళా పోరాటదినంగా మార్చి 8న పాటిస్తున్నారు. క్లారా జట్కిన్ ప్రతిపాదనలోని స్ఫూర్తి ఏదైతే ఉంతదో తుంగలో తొక్కి మార్చి 8న సరదా ఉత్సవ దినంగా భారతదేశ సంపన్నవర్గ, ఉత్నత మధ్యతరగతి వర్గ మహిళలు, వారి సంఘాలు దిగజార్చివేశాయి. ఆకలి, దారిద్య్రం, నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నప్పటికి స్వాతంత్య్ర స్వలర్ణోత్సవాలను సంబరంగా ఎలా జరుపుతున్నారో అదేవిధంగా ఈవ్ టీజింగ్, అత్యాచారాలు, వరకట్న దురాచారం మొదలైన సమస్యలతో స్త్రీల స్థితిగతులెంత దుర్ఛరంగా వున్నప్పటికీ మార్చి 8న మహిళా ఉత్సవంగా జరపటం శోచనీయం.
దేశ జనాభాలో సగభాగమైన స్త్రీలలో ఎక్కువమంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వ్యవసాయ కూలీలే, వీళ్ళకి భూమిమీద ఎటువంటి హక్కు లేకపోవటం వలన భూస్వామ్య వర్గాలవారి దోపిడీకి గురౌతున్నారు. చేనేత వంటి చేతివృత్తులు చేసే మహిళలు కూడా నిరంతరం బండచాకిరీ చేస్తూ తాము తయారుచేసిన వస్తువులకు గిట్టుబాటు ధరలేక, సరైన మార్కెట్‌టింగ్ సౌకర్యంలేక విలవిలలాడుతున్నారు. ఎక్కువభాగం దళితులుగా వున్న గ్రామీణ ప్రాంతం మహిళలు శ్రమదోడిపిడితోపాటు సాంఘిక వివక్షకు, భూస్వామ్య వర్గాల లైంగిక వేధింపులకి గురైరౌతున్నారు.
పారిశ్రామిక రంగమంతటా ఉన్న స్త్రీలలో ఎక్కువమంది ఆసంఘటింత కార్మికులుగా వున్నారు. వీరి శ్రమశక్తి కారుచౌకగా కొల్లగొట్టబడుతోంది. నైనుణ్యంలేని విసుగు కల్గించే పనుల్లో ఎక్కువ సమయం పనిచేస్తూ ఆతి తక్కువ వేతనాలతో దుర్భర జీవితాలను గడుపుతున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులలో శ్రామిక స్త్రీలేకాక మధ్యతరగి స్త్రీలు కూడా తప్పసనిసరిగా ఉద్యోగం చేయలవలసిన స్థితికి నెట్టుబడ్డారు.
వీరిలో ప్రైవేటు సర్విసు రంగంలో టీచర్లు, నర్సులు, టెలిఫోన్ ఆపరేటర్లు మొదలైనవారు అతి తక్కువ వేతనాలు పొందుతున్నారు. యజమానులు దోపిడీ, దౌర్జన్యాలకు గురౌతున్నారు. ఇంకా ఇళ్ళలో పనిమనుషులుగా, బీడీ కార్మికులుగా, భవన నిర్మాణ కార్మికులుగా, కూరగాయలు, పూలు, పళ్ళుఅమ్మకునేవారిగా, అగరబత్తుల తయారీ, పేపర్ సంచుల తయారీ, ఇంకా అనేక చిల్లరమల్లర పనులలో రోజంతా నిమగమైనప్పటికీ వారికి ముట్చే ప్రతిఫలం నామమాత్రమే. ఉత్పాదక రంగంలో శ్రమ దోపిడితో పాటు కుటుంబంలోనే వీరి తీవ్రమైన దోపిడీదౌరన్యాలకు గురౌతున్నారు.
పితృస్వామిక కుటుంబ వ్యవస్థలో స్త్రీల బానిసగా చూడబడుతోంది. కుటుంబంలో ఆమె చేసే పనికి విలువిలువ లేదు. నిరంతరం బండచాకిరీ చేసి, పిల్లల్ని కని పెంచే యంత్రంగానే స్త్రీని చూస్తున్నారు. పురుషునితో సమానంగా పనిచేసి కుటుంబ ఆర్థిక బాధ్యతలను పంచుకున్నటిప్పటికీ ఇలించాకీరీ, పిల్లల పెంపకం ఇంకా స్త్రీల పనులుగానే చూడబడుతున్నాయి. మెజారిటి స్త్రీలు సరి అయిన తిండికి, విద్యకి, వైద్యానికి దూరంగానే ఉన్నారు. సంతానంలో మగపిలల్లలు ఆడపిల్ల మధ్య వివక్షత తీవ్రంగా కొనసాగుతంతోంది. సాంఘికంగా అత్యంత దయనీయ స్థితిలో స్త్రీలు ఉన్నారు.
దేశంలో రెండవ శ్రేణి పౌరులుగా చూడబతడుతున్న స్త్రీలు అనేక సాంఘిక దురాచాలకు బలౌదతున్నారు. దళిత కులాలకు చెందిన స్త్రీలను దేవదాసీలు, జోగినులుగా చేసే ఆచారం తెలంగాణా జిల్లాలో ఇంకా కొనసాగుతూనే వుంది. వరకట్న దురాచారం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎంత విద్యావంతులైన, ఉద్యోగం చేస్తున్నా కట్నం ఇవ్వకపోతే పెళ్ళి జరగని పరిస్థితి నేటికీ వుంది.
పెరుగుతున్నా వస్తు వ్యామోహ సంస్కృతి, కష్టడకుండా డబ్బు సంపాదించాలనే ఆలోచనలు వరకట్నం దాహాన్ని పెంచుకతున్నాయి. కట్నం కోసం స్త్రీలను వేధించి చివరకు చంపి వేసే సంఘటనలు నిత్యకృత్యమైపోయాయి.వీటికి ప్రేమ విహాలు సైతం మినహాయింపుకావు. ప్రేమ హత్యలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న కొత్త సంఘటనలు, గుంటూరులో తన ప్రేమను కాదన్నందుకు వరలక్ష్మి అనే విద్యార్థినిని కళాశాల క్లాసులోనే హత్య చేయడం తదితర సంఘటనలు నిత్యకృత్యమైపోయాయి. వివిధ టివి చానళ్ళ, పత్రికలు, సినిమాలు, వినోదం పేరిట ద్వందార్థ పదాలను విరివిగా వాడటం, సెక్సు, హింసలను పెంచి పోషించడం చేస్తున్నాయి. లైంగికోద్రేకాలను పెంపొందించపజేసే విధంగా ఈ కార్యక్రమాలు యువతను పెడ త్రోవ పట్టిస్తూ స్త్రీలపై అత్యాచారాలకు పురికొల్పుతున్నా.
స్త్రీలు పోరాడి సాధించుకున్న మధ్యనిషేధం ఎత్తివేసిన తర్వాత విచ్చలవిడిగా పెరిగిన మధ్యం అమ్మకాలు కూడా వీటిని ప్రోత్సహిస్తున్నాయి.. సామ్రాజ్యవాద సంస్కృతి విచ్చల విడితనాన్ని ప్రోత్సహించి స్త్రీలను పై అల్యాచారాలకు పురికొల్పుతున్నాయి.
పారిశ్రామిక ఉత్పతులు అమ్మకాలకు, స్త్రీల అర్థనగ ప్రదరÊశనల ప్రకటనలు సర్వసాధారణమైపోయాయి. శ్రమతో సంబంధంలేని, స్త్రీల వ్యక్యిత్వాలను కించపరిచే అందాలపోటీల సంస్కృతి నగరాల నుంచి పట్టాణాలకు విస్తరిస్తోంది. మధ్యతరగతి, ఆపై తరగతి, సంపన్న తరగతి యువతులకు అందాల పోటీలు వీక్షించడం, తాము కూడా ఓ సుస్మితాసేన్‌లాగనగానో, మరో డయానాహెడెన్‌లాగానో ప్రపంచ సుందరులుఉ కావాలని కలలు కనడం ఆశయమయాలుగా మిగిలాయి. అలంకరంగకరణ సంబంధిత కాస్మాటిక్స్ ఉత్పత్తులను భారతదేశం వంటి మూడవ ప్రపంచ దేశాల్లో అమ్ముకోవడానికి సామ్రాజ్యవాద దేశాలు చేస్తోన్న కుట్రల్లో భాగంగా మాత్రమే వెనకబడ్డ దేశాలకి చెందిన యువతులు ప్రపంచ సుందరులు కాగలుగుతున్నారనే నిజంఎక్కువమంది గ్రహించడం లేదు.
ఈ విధంగా సమాజం, రాజకీయ పార్టీలు, అధికార యంత్రాంగం, కుటుంబం, న్యాయవ్యసవస్థన ఏమీ కూడా స్త్రీలకి రక్షణ కల్పించని ప్రస్తుతం పరిస్థిలులో , ఆకలి, దారిద్య్రం, నిరుద్యోగం, ధరలు పెరగటం, అందాల పోటీలు, ఆల్యాచారాలు, ఈవ్‌టీసింగ్ మొదలైన వాటికి వ్యతిరేకంగా పితృస్వామిక వ్యవస్థ పై మహిళలు కలిసికట్టుగా పోరాడాల్సి అవసరం నేటి స్త్రీలపై వుంది.
మహిళపై ఆత్యాచారం, వేధింపులను పదునైన ఆయుధాలుగా ధరించిన పితృస్వామిక వ్యవస్థపై రాజీలే పోరాటం సాగిస్తామని క్లారా జట్కిన్ ప్రతిపాదనలోని స్ఫూర్తితో ఈ అంతర్జాతీయ మహిళా పోరాట దిన సందర్భంగా స్త్రీలందరూ ప్రతిన బూనాలి.
No comments:
Post a Comment