Wednesday, March 9, 2011

కిరీటం దక్కెనే

అందాలపోటీలు ఏ రేంజ్‌లో వుంటాయో అందరికీ తెలిసిన విషయమే. నఖశిఖ పర్యంతం పరీక్షించాకే ఎవరు అందరిలోకి అందగత్తో ప్రకటిస్తుంటారు. అలాంటిది నెత్తిమీద జుట్టు లేకుండానే అందాల కిరీటం కొట్టేస్తే...! అదే జరిగింది అమెరికాలో! కయ్లా మార్టెల్‌ గత కొద్ది సంవత్సరాలుగా మిస్‌ డెల్వారె అందాల పోటీలో పాల్గొంటోంది. నిరాశగా తిరిగొస్తోంది. కారణం! ఆమెకు గుండు. వెంట్రుకలు లేకుండా అందాలరాణి కిరీటం దక్కించుకోవడం ఎంత కష్టం. అయితే ఆమె వాస్తవ గాథ తెలుసుకున్న న్యాయనిర్ణేతలు చివరికి తనకే కిరీటాన్ని కట్టబెట్టారు.
కథలోకెళితే... కయ్లాకు ఓరకమైన అనారోగ్యం వుంది. దాంతో తన పదో ఏట నుంచే వెంట్రుకలు రాలిపోసాగాయి. చివరకు అది పూర్తిగా గుండులా తయారైంది. కానీ ఆమెకేమో అందాలపోటీల్లో పాల్గొనాలని, కిరీటం గెలవాటని ఆశ. అందుకే పాల్గొనేది. చివరికి జరిగినది తెలుసుగా. అంతేకాదండోరు. మిస్‌ అమెరికా పోటీలకు కూడా అర్హత సంపాదించిందీ గుండు సుందరి. సరేగానీ మీకో అనుమానం పీడిస్తుండాలే! అదేనండీ గుండుతో అందాల పోటీల్లో ఎలా పాల్గొంటోంది అని. అప్పుడు విగ్గు పెట్టుకుని మేనేజ్‌ చేస్తుంది. బొమ్మలో కయ్లా దువ్వుతోంది తన విగ్గునే.

No comments:

Post a Comment