Sunday, March 20, 2011

ఇసుక లడ్డు తింటుంటే...

మనం ఏదైనా తినేప్పుడు ఇసుక రేణువు ఒక్కటి పంటికింద పడితేనే మొహం వికారంగా పెట్టేస్తాం. తుపుక్కున నోట్లోదంతా ఊసేస్తాం. అలాంటిది గుప్పిట నిండా ఇసుక తీసుకుని నోట్లో వేసుకుని నమిలి తినాలంటే... ఇంకేమైనా వుందా! ఊహించడానికే వికారంగా వుంది కదూ. కానీ ఓ రష్యా మహిళ నిత్యం ఆ విధంగానే ఇసుకను భోంచేస్తోంది. చూడండి సున్నుండ తిన్నంత ప్రియంగా ఎలా తింటోందో ఇసుకను. ఆమె ప్రతి రోజూ ఓ బకెట్‌ తీసుకుని ఊరికి దూరంగా వున్న ఇసుక దిబ్బ దగ్గరకు వెళుతుంది. చక్కగా బకెట్‌ నిండా ఇసుక నింపుకుంటుంది. ఇంటికి వచ్చేస్తుంది. ఇంక టిఫిన్‌, కాఫీ, భోజనం ... అన్నీ ఆ బకెట్‌ ఇసుకే. ఆమెకు అది తింటేనే నోటికి రుచిగా వుంటుందిట. జిహ్వకో రుచి అని పెద్దలు ఊరకే అన్నారా మరి! ఇలాంటి వారిని చూచే అనుంటారు.

No comments:

Post a Comment