Sunday, March 20, 2011

పతాకాల పచ్చబొట్లు

ఈ మధ్య పచ్చబొట్లు పిచ్చి పట్టుకుంది బాగా. విదేశాల్లో అయితే మరీనూ. వంటి నిండా రకరకాల ... రంగురంగుల పచ్చబొట్లు పొడిపించుకోవడం ఫ్యాషనైపోయింది. ఒక్కొక్కరిది ఒక్కో ధీమ్‌. కొందరు తమకు ఇష్టమైన పక్షులు, జంతువులు, మనుషులు, కట్టడాలు, చెట్లు, పాటలు, గేయాలు... పచ్చబొట్లుగా వేయించుకుంటారు. కొందరైతే తమకు అత్యంత ప్రియమైన వారి పేర్లు పచ్చబొట్టుగా పొడిపించుకుంటారు. ఇక్కడ చూడండి! ఈయన పేరు రిషి. దగ్గరదగ్గరగా 70 ఏళ్లుంటాయి. ఈయనగారు ఇప్పటికే నాలుగు సార్లు గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కేశాడు. అయితే ఇప్పుడు తాజాగా ఐదోసారి కూడా గిన్నిస్‌ బుక్‌లో పేరు సంపాదించాలని తహతహలాడుతున్నాడు. అదీ పచ్చబొట్లు పొడిపించుకుని. అదీ వివిధ దేశాల పతాకాలను వేయించుకొని. చూశారుగా నుదుటి మీద జండాలు. అలా వంటి నిండా ప్రపంచంలోని 220 దేశాల జండాలను తన వంటిమీద పచ్చబొట్ల రూపంలో చూసుకోవాలని ముచ్చటపడుతున్నాడు. ఒక్కో జండా ఒక్కో అంగుళం సైజులో వుంటేగానీ అన్నిటికీ స్థలం సరిపోదని చెప్తున్నాడు. ప్రస్తుతం ఆ పనిలోనే ఆయనగారు బిజీగా వున్నారు. అన్నట్లు ఈయన మన భారతీయుడే.

No comments:

Post a Comment