Monday, March 21, 2011

ఆస్ట్రేలియాను చిత్తు చేస్తాం: యువరాజ్ సింగ్ ధీమా

క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టును చిత్తుగా ఓడిస్తామని భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించేందుకు కూడా ఇదే మంచి తరుణమన్నారు. ఆ జట్టులో కీలకమైన ఆటగాళ్ళు రిటైర్ అయ్యారని యువరాజ్ గుర్తు చేశాడు. ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై భారత్ గెలవడంతో గ్రూపు-బిలో రెండో స్థానం దక్కించుకున్న భారత్.. వచ్చే గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్‌‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. దీనిపై యువరాజ్ సింగ్ మాట్లాడుతూ ఆస్ట్రేలియా జట్టు ఐదు మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఇరు జట్లు సమాన బలంతో ఉన్నాయన్నారు.

అయితే, మ్యాచ్ జరిగేరోజున ఎవరిదైతే పైచేయిగా ఉంటుందో వారిదే విజయలక్ష్మీ వరిస్తుందన్నారు. గత మూడేళ్లుగా ప్రపంచ కప్ టైటిల్స్‌ను ఆస్ట్రేలియా ఎగురేసుకుని పోతోందని, ఈ విషయంలో ఎలాంటి ఎవరికీ సందేహం లేదన్నారు. అయితే, గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ వంటి కీలక ఆటగాళ్ళు ఆ జట్టులో లేరన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఇకపోతే.. కెప్టెన్ రికీ పాంటింగ్ ఫామ్‌లో లేరని యువీ చెప్పుకొచ్చాడు.

No comments:

Post a Comment