Thursday, March 24, 2011

చిరంజీవి చిన్నల్లుడు శిరీష్‌ భరద్వాజ్‌కు జైలు తప్పదా...?

చిరంజీవి చిన్నకుమార్తె శ్రీజను ప్రేమించి పెళ్లి చేసుకున్న శిరీష్ భరద్వాజ్‌కు జైలు తప్పేట్లు లేదు. ప్రేమించి పెళ్లాడిన శ్రీజ తన భర్త వరకట్న వేధింపులకు గురిచేస్తున్నారని మార్చి 14వ తేదీన సీసీఎస్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నది.
ఈ నేపథ్యంలో శ్రీజ అత్త, భర్త ఇద్దరూ ముందస్తు బెయిలుకై నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు మాత్రం వీరిద్దరిలో శిరీష్ తల్లికి మాత్రమే షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేసింది. శిరీష్ భరద్వాజ్‌కు మాత్రం బెయిలు నిరాకరించింది. దీంతో శిరీష్‌కు జైలు తప్పదని అనుకుంటున్నారు.

No comments:

Post a Comment