Thursday, March 24, 2011

భారత్‌ పకడ్బందీ బౌలింగ్‌

వన్డే క్రికెట్‌ ప్రపంచ కప్‌ రెండో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతోంది. అహ్మదాబాద్‌ మొతారేలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియం ఈ పోరుకు వేదిక. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ కీలకమైనదే. ఓడిన జట్టు ప్రపంచ కప్‌ పోరు నుంచి వైదొలుగుతుంది. స్వల్ప మార్పులతో ఇరు జట్లు రంగంలోకి దిగుతున్నాయి. సెహ్వాగ్‌ ఈ మ్యాచ్‌లో ఆడడనే అనుకున్నారు. కానీ చివరి నిముషంలో నిర్ణయం మార్చుకున్న ధోని అతనిని జట్టులోకి తీసుకున్నాడు. సెహ్వాగ్‌ కోసం యూసఫ్‌ పఠాన్‌ను పక్కనబెట్టాల్సి వచ్చింది. ఆసీస్‌ స్మిత్‌ స్థానంలో డేవిడ్‌ హసీని తుది జట్టులోకి తీసుకుంది. వికెట్‌ కీపర్‌-కెప్టెన్‌గా ధోనికిది వందో వన్డే.
భారత్‌ అశ్విన్‌, జహీర్‌లతో బౌలింగ్‌ ప్రారంభించింది. ఎనిమిదో ఓవర్‌లో హర్భజన్‌ తోడయ్యాడు. ఈ ముగ్గురు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. ఫలితం 10వ ఓవర్‌లో కనిపించింది. వాట్సన్‌(25) అశ్వికు బౌల్డ్‌ అయ్యాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్‌ కోల్పోయి ఆస్ట్రేలియా 40 పరుగులు చేసింది. హెడెన్‌, పాంటింగ్‌ క్రీజులో ఉన్నారు.
జట్లు: ఆస్ట్రేలియా: పాంటింగ్‌, క్లార్క్‌, బ్రాడ్‌ హెడెన్‌, డేవిడ్‌ హసి, మైకేల్‌ హసీ, జాన్సన్‌, క్రేజా, బ్రెట్‌లీ, టెయిట్‌, వాట్సన్‌, కామెరూన్‌ వైట్‌.
భారత్‌: ఎంఎస్‌ ధోని, వీరేంద్రసెహ్వాగ్‌, గౌతం గంభీర్‌, సచిన్‌ టెండూల్కర్‌, సురేష్‌ రైనా, విరాట్‌ కోహ్లి, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌, అశ్విన్‌, మునాఫ్‌ పటేల్‌.

No comments:

Post a Comment