మొహాలీ మ్యాచ్‌లో తమ అంచనా తప్పిందని, అయినప్పటికీ.. కోట్లాది మంది భారతీయుల అభిమానంతో ఈ మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించినట్టు టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిప్రాయపడ్డారు. మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ మొహాలీ పిచ్‌ను పరిశీలించిన తర్వాత ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలనే అంచనాకు వచ్చామన్నారు. అందుకే అశ్విన్‌ను తప్పించి అతని స్థానంలో నెహ్రాకు చోటు కల్పించామన్నారు.
అయితే, బరిలోకి దిగిన తర్వాత మా అంచనా తప్పిందన్నారు. పిచ్ స్పిన్‌కు అనుకూలంగా మారిందన్నారు. అయినప్పటికీ.. కోట్లాది మంది భారతీయ క్రికెట్ అభిమానుల అండదండలు, మద్దతుతో అద్భుత విజయాన్ని నమోదు చేసుకున్నామన్నారు.
ఈ మ్యాచ్‌లో తమ ప్రధాన బౌలర్ జహీర్ ఖాన్ అద్భుతంగా చేశారన్నారు. మిగిలిన బౌలర్లు కూడా బాగా బౌల్ చేశారని చెప్పుకొచ్చారు. ఇది సమిష్టి విజయమన్నారు. కీలక సమయంలో వికెట్లు తీసిన బౌలర్లు జట్టును ఆదుకున్నారన్నారు.
ఏప్రిల్ రెండో తేదీన వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్ కోసం తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అత్యంత కీలకమైన ఘట్టాన్ని అధికమించామని, ఫైనల్‌లోనూ ఇదే ఊపుతో రాణిస్తామని ధోనీ చెప్పుకొచ్చాడు.

No comments:
Post a Comment