Wednesday, March 30, 2011

మంత్రి పదవికి వైఎస్.వివేకానంద రెడ్డి రాజీనామా!

రాష్ట్ర మంత్రి పదవికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సోదరుడు వైఎస్.వివేకానంద రెడ్డి బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమర్పించారు. అయన రాజీనామాకుగల కారణాలు మాత్రం తెలియరాలేదు.
ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా ఉన్న వైఎస్.వివేకానంద రెడ్డి తన పదవీకాలం మంగళవారంతో ముగిసింది. దీంతో ఆయన మంత్రిపదవికి రాజీనామా చేశారా అనేది సందేహంగా మారింది. వాస్తవానికి తన పదవీకాలం ముగిసినప్పటికీ.. మరో ఆరు నెలల పాటు ఆయన మంత్రిగా కొనసాగవచ్చు. కానీ ఆయన పదవీకాలం ముగిసి 24 గంటలు కూడా పూర్తికాకముందే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

పైపెచ్చు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో జరిగిన భూ కేటాయింపులను నిగ్గు తేల్చేందుకు సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని అంగీకరించలేక మంత్రి పదవికి రాజీనామా చేశారా అన్నది తేలాల్సి వుంది. అయితే, రాజీనామా వ్యవహారంపై ఆయనను మీడియా ప్రశ్నించగా, తన రాజీనామా లేఖపై ముఖ్యమంత్రినే అడిగి తెలుసుకోండని సమాధానం ఇచ్చారు.

No comments:

Post a Comment