మియామీలో జరుగుతున్న సోనీ ఎర్రిక్సన్ టెన్నిస్ టోర్నమెంట్లో బెలారస్ టెన్నిస్ స్టార్ విక్టోరియా అజారెంకా సంచలన విజయం సాధించింది. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో ప్రపంచ నెంబర్ టూ క్రీడాకారిణి కిమ్ క్లియస్టర్స్‌ను అజారెంకా మట్టికరిపించి, సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో 6-3 6-3 తేడాతో విక్టోరియా అజారెంకా విజయం సాధించింది. అయితే 44 తప్పిదాలు చేసిన కిమ్ క్లియస్టర్స్ పరాజయం పాలైంది.
ఈ సందర్భంగా కిమ్ క్లియస్టర్స్ మాట్లాడుతూ.. మానసికంగా, శారీరకంగానూ ఫిట్‌గా లేకపోవడంతో అజారెంకాపై మెరుగ్గా ఆడలేకపోయానని తెలిపింది. పోటీ పటిమతో అజారెంకాతో రాణించలేకపోయాయని క్లియస్టర్స్ చెప్పింది.
ఈ సందర్భంగా కిమ్ క్లియస్టర్స్ మాట్లాడుతూ.. మానసికంగా, శారీరకంగానూ ఫిట్‌గా లేకపోవడంతో అజారెంకాపై మెరుగ్గా ఆడలేకపోయానని తెలిపింది. పోటీ పటిమతో అజారెంకాతో రాణించలేకపోయాయని క్లియస్టర్స్ చెప్పింది.
No comments:
Post a Comment