
నాగార్జున, అనుష్క, రవితేజ ఇళ్లపై ఏకకాలంలో ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తోంది. వీరితోపాటు మరికొంతమంది సినీ ప్రముఖుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో.. ముఖ్యంగా తెలంగాణా ఉద్యమం తర్వాత సినీతారలు పెద్ద ఎత్తును విశాఖపట్టణంలో భూములు కొనుగోలు చేయడంతో ఐటీ వారిపై దృష్టి సారించింది.
భూమి కొనుగోళ్ల విషయంలో భారీ మొత్తంలో నిధుల మార్పిడి జరిగినట్లు ఆదాయపన్ను శాఖ గుర్తించిన నేపధ్యంలో ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ దాడులు బుధవారం సాయంత్రం వరకూ జరుగుతాయని ఓ ఐటీ అధికారి వెల్లడించారు.
No comments:
Post a Comment