లిబియా ఒబామా ప్రయోగశాల కానుందా ? లిబియా మరో ఇరాక్ కానుందా ? లిబియా ప్రజాస్వామ్య ఆకాంక్షలు ఆవిరి అయినట్లేనా..? అంటే... అవుననే అంటున్నారు రాజకీయ పరీశీలకులు. ప్రస్తుత పరిస్థితులు కూడా అలాగే వున్నాయి. మార్చి 19న లిబియా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రాంతాలపై అమెరికా,ప్రాన్స్, బ్రిటన్ సంకీర్ణ సేనలు చేసిన దాడులను చూస్తే ఇది అమెరికా ప్రణాళికలో భాగమేనని చెపుతున్నారు.
రిపోర్టులు, టీవీల్లో చూసిన దృశ్యాలను చూస్తూ ఉంటే 2003లో జార్జి బుష్ ప్రభుత్వం ఇరాక్‌లో సృష్టించిన వినాశనం గుర్తుకు వస్తుంది. తిరగుబాటుదారుల చేతిలో ఉన్న ప్రాంతాల్లోని పౌరులపై దాడులను నిరోధించేందుకే మానవతా దృక్పధంతో లిబియాలో మిలిటరీ చర్యలు చేపడుతున్నట్లు సంకీర్ణ సేనలు చెబుతున్నప్పటికీ వారి అసలు లక్ష్యం వేరే విధంగా వుంది.
లిబియాలో అధ్యక్షుడు గడాఫీని సాధ్యమైనంత త్వరగా తొలగించి పాశ్చాత్య అనుకూల నాయకుడిని ఆ స్థానంలో కూర్చోపెట్టి పాశ్చాత్య కంపెనీలు లిబియాలోని ఇంధనం, గ్యాస్‌లను కొల్లగొట్టేలా చేయడమే ఆ సేనల అసలు లక్ష్యంగా కనబడుతోంది.
ఆయిల్ కొల్లగొట్టడమే వాటి లక్ష్యంగాని లిబియాలో మానవ హక్కులను కాపాడడమో లేక ప్రజాస్వామ్య ప్రక్రియ ఏర్పాటు చేయటానికో కాదని తెలుస్తోంది. ఇరాక్ ప్రజలందరిని సద్దాం హుస్సేన్ కష్టాలపాలు చేసినప్పటికి ఇరాక్ ప్రజలందరిని ఐక్యంగా ఉంచగలిగాడు. అలాగే లిబియా నియంత గడాఫీ కూడా ప్రజలను ఇబ్బందులు పెట్టినప్పటికీ ప్రజలను సమిష్టిగా వుంచాడు. అయితే 2003లో సద్దాం హుస్సేన్‌ను ప్రపంచంలో ఏ శక్తి కాపాడనట్లే ఈ లిబియా నేతను కూడా 2011లో ఎవరూ కాపాడలేరేమోనన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

No comments:
Post a Comment