కావలసిన పదార్థాలు
ఉడకబెట్టిన బంగాళదుంప ముద్ద - 1/2 కప్పు
శనగపిండి - 1 కప్పు
ఉప్పు - తగినంత
కారం - రుచికి సరిపడా
నూనె - వేయించడానికి తగినంత
తయారు చేసే విధానం
శనగపిండిలో ఉప్పు, కారం వేసి జల్లించుకోవాలి. బంగాళదుంప ముద్దని కూడా జల్లెడలో వేసి రుద్దితే గడ్డలు లేకుండా మెత్తని గుజ్జు వస్తుంది. ఇందులో వేడినూనె వేసి బాగా కలపాలి. అసరమైనన్ని నీళ్లుపోసి ముద్దగా కలపాలి. దీన్ని జంతికల గిద్దెల్లో పెట్టి కాగిన నూనెలో వత్తి వేయించాలి. అంతే కరకరలాడే బంగాళదుంప కారప్పూస రెడీ. ఇవి అచ్చంగా చిప్స్‌లా ఉంటాయి. పిల్లలు భలే ఇష్టంగా తింటారు.
No comments:
Post a Comment