యాపిల్ పేస్ట్ - 2 కప్పులు
బ్రెడ్ ముక్కలు - 8
పంచదార - 2 కప్పులు
నీళ్లు - 1 కప్పు
బాదం పప్పు తరుగు - 2 టీ స్పూన్లు
ఇలాచి పొడి - కొంచెం
నూనె - వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం
బ్రెడ్ ముక్కలు చివరలు కత్తిరించుకోవాలి. పంచదార, నీళ్లు కలిపి లేత పాకం పట్టి గోరువెచ్చగా ఉంచాలి. బ్రెడ్ ముక్కలను కొంచెం తడిపి వాటి మధ్యలో యాపిల్ పేస్ట్‌ను పెట్టి ముద్దగా చెయ్యాలి. వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వీటిని పంచదార పాకంలో వేయాలి. పాకం బాగా పీల్చిన తర్వాత వీటిని తీసి ఓ గిన్నెలో పెట్టాలి. చివరిగా వాటిపై బాదం తరుగు, ఇలాచీ పొడి చల్లాలి. అంతే నోరూరించే యాపిల్ రసగుల్లాలు రెడీ.
No comments:
Post a Comment