''నీరజా! ఎక్కడున్నావే, ఉలకవు, పలకవూ? ఓసినీ..! ఇక్కడే ఉండి కూడా పలకవేమే!'' అంటూ నీరజ ఇంట్లో అడుగుపెట్టింది లత. ''అక్కా! చాన్నాళ్లకొచ్చావ్. రా... రా...!'' ఆప్యాయంగా ఆహ్వానించింది నీరజ. ఎప్పుడూ హుషారుగా కనిపించే నీరజ దిగాలుగా ఉండటం గమనించిన లత, ''నీరజా! ఎందుకంత నీరసంగా ఉన్నావు. ఆరోగ్యం బాలేదా?'' ఆందోళనగా అడిగింది లత. ''ఆరోగ్యానికేమక్కా! బంగారంలా ఉంది. నా దిగులంతా మున్నా చదువు గురించే! అసలే పదో తరగతి.'' అంది నీరజ నీరసంగా.
''వాడికేమే! బాగానే చదువుకుంటాడుగా! మీరెలాగూ ర్యాంకులు, మార్కులు అంటూ ఒత్తిడి చేయరు. ఇంకేంటి బెంగ! కొంపదీసి నువ్వూ వాడికి టార్గెట్లు ఇచ్చి ఒత్తిడి చేస్తున్నావా ఏంటీ?'' నీరజ మొహంలోకి చూస్తూ ప్రశ్నించింది లత.
''లేదక్కా! అలాంటి టెన్షన్లు పెట్టి ఉన్న వాడిని శారీరకంగా, మానసికంగా అలసటకు గురిచెయ్యడం నాకూ, ఆయనకూ ఇష్టముండదు. నీకు తెలుసుగా!'' అంటూ నవ్వింది నీరజ. ''మరింకేం వచ్చిందే!'' విశ్రాంతిగా దీవానుపై వాలుతూ అంది లత.
''కాదక్కా! రాష్ట్ర వాతావరణం చూస్తుంటేనే భయమేస్తోంది. వీడి పరీక్షలు తిన్నగా జరుగుతాయా లేదా అనేదే నా భయం'' అంటున్న నీరజను చూస్తూ గాఢంగా నిట్టూర్చింది లత.
''నిజమేనే! నీ భయంలో అర్థముంది. పదో తరగతి అంటే భవిష్యత్తుకు అసలైన పునాదిపడే సమయం. అసలే కాలం ఎంతో విలువైనది. అలాంటిది ఏ రోజుకారోజు ఏదో ఒక టెన్షన్ ప్రజల్లో ఉంటోంది. మా అన్నయ్య కూతురు ఇంటరు చదువుతోంది. దానికీ ఇదే టెన్షన్. అసలే కాలేజీ సవ్యంగా జరిగింది లేదు. ఏదో కష్టాలుపడి సిలబస్ పూర్తి చేసి, కష్టపడి చదువుకుంటే ఇప్పుడు పరీక్షలు జరుగుతాయా లేదా అనే ఆందోళన. నిజంగా పిల్లలకు చెప్పరాని తిప్పలనుకో'' అంది లత.
''ఇలాగైతే ఎలా అక్కా! లక్షల సంఖ్యలో ఉన్న పిల్లల భవిష్యత్తుపై కొంచెమైనా ఆలోచించాలిగా!'' అంటున్న నీరజను చూస్తూ, ''అంత తీరిక ఎవరికుందే! కొందరికి పదవులే ప్రథమ దీక్ష. మరి కొందరిది ప్రాంతాలవారీ కొట్లాట. ఇంకొందరికి ఉన్న పదవిని కాపాడుకోవాలన్న ఆకాంక్ష. ఇవికాక, మతంపేరిట మత్తు జల్లే యుక్తులు. సందు చూసుకుని రెచ్చిపోయే అరాచక శక్తులు. వీటన్నింటి మధ్యా సామాన్య మానవుడు ఎంత ఉక్కిరిబిక్కిరవుతున్నాడో అర్థంచేసుకోరు. వీటివల్ల అతని కష్టం తీరుతుందా? దినదిన గండం, నూరేళ్లాయుష్షులా ఏ రోజు కూలితో ఆ రోజు పొట్టనింపుకునే వారికి పని ముఖ్యం. అదెవరూ ఆలోచించరు. పోరాడదల్చుకుంటే పెరిగిన ధరలపై పోరాడాలి. రాజకీయ అనిశ్చితిని ప్రశ్నించాలి. అన్యాయాలు, అక్రమాలపై, నిత్యం ఎదుర్కొనే సమస్యలపై పోరాడాలి. ప్రజాసంక్షేమంకోసం ఆరాటపడాలి. ఇవన్నీ పక్కనపెట్టి ఎవరి స్వలాభం వారిదేనయ్యే'' ఆవేశంగా అంది లత.
''ప్రజలు ఇవన్నీ గమనిస్తూనే ఉంటారక్కా. తమ కష్టాలను పట్టించుకోని పాలకులను, నాయకులను ఎవరు మాత్రం సహిస్తారు చెప్పు. అవకాశం చేజిక్కినప్పుడు సమాధానం వారే చెబుతారు'' అంది నీరజ.
''అదీ నిజమే! అనుకుంటాం కానీ, అన్నీ ఓ కంట కనిపెట్టి సరైన సమయంలో వాత పెట్టేది వాళ్లే. అలాగే పరీక్షలకు ఆటంకం కలిగినా ప్రజలు ఊరుకోరు. నష్టాన్ని భరించడానికి రేపటి తరమూ సిద్ధంగా లేదు. అంతా సవ్యంగానే జరుగుతుంది. కానీ నువ్వే దిగులుపడకు. బావగారు వచ్చే టైమైంది. నే వెళ్లొస్తా'' అంటూ సెలవు తీసుకుంది లత.

Illustration is fantastic. Who is the artist ?
ReplyDelete