సేమ్యా - 200గ్రా
ఇడ్లీ రవ్వ - 50 గ్రా
మజ్జిగ - 1 కప్పు
(అవసరమైతే కొంచెం
ఎక్కువగా తీసుకోవచ్చు)
మినప్పప్పు - 1 టీ స్పూను
ఆవాలు - 1 టీ స్పూను
అల్లం - అరంగుళం ముక్క
పచ్చిమిర్చి - 2, జీడిపప్పు - 10
నెయ్యి - 2 స్పూన్లు, కరివేపాకు - 2 రెమ్మలు
ఉప్పు - సరిపడా
తయారు చేసే పద్ధతి
సేమ్యాని బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. నెయ్యి వేడిచేసి మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు వేయించాలి. అందులోనే జీడిపప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, రవ్వ కలిపి వేయించాలి. స్టౌమీద నుండి దించి వేయించిన సేమ్యా కలిపి అందులో మజ్జిగ, ఉప్పు వేసి కలిపి పది నిమిషాలు నాననివ్వాలి. ఇడ్లీప్లేట్లలో ఆ మిశ్రమాన్ని వేసి ఆవిరితో ఉడికిస్తే చాలు సేమ్యా ఇడ్లీ తయారైపోయినట్లే. వీటిని వేడివేడిగా కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా వుంటాయి.
No comments:
Post a Comment