Tuesday, February 1, 2011

మటన్‌ కట్లెట్‌

కావలసిన పదార్థాలు
ఎముకలు లేని మాంసం - పావుకిలో
పాలు - అరకప్పు , కోడిగుడ్లు - 2 (తెల్లసొన మాత్రమే)
వెల్లుల్లి - 4 రెబ్బలు
అల్లం - అంగుళం ముక్క
పచ్చిమిర్చి - 2
కొత్తిమీర తురుము - 2 టేబుల్‌ స్పూన్లు
జీలకర్రపొడి - 1 టీ స్పూన్‌

బ్రెడ్‌ పొడి - 2 కప్పులు
లవంగాలు - 2, దాల్చినచెక్క - అంగుళం ముక్క
యాలకులు - 2
నెయ్యి లేదా నూనె - వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం
మాంసం ముక్కల్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము, జీలకర్ర పొడి, లవంగాలు, దాల్చినచెక్క వేసి ఉడికించాలి. అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. సన్న సెగమీద పెట్టి నీళ్లన్నీ ఇంకిపోయేవరకు మెత్తగా ఉడికించాలి. దీన్ని స్టౌ మీది నుండి దించి ఆరాక మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చెయ్యాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లాగా చేయాలి. వీటిని కోడిగుడ్డు తెల్లసొనలో ముంచి తర్వాత బ్రెడ్‌ పొడిలో ముంచాలి. ఆ తర్వాత నూనెలో దోరగా వేయిస్తే చాలు. వీటిని పొదినా చట్నీలో తింటే చాలా రుచిగా వుంటాయి.

No comments:

Post a Comment