ఫ్యాషన్ డిజైనింగ్ ఇప్పుడొక ఉపాధి కల్పనల రంగంగా విస్తరిస్తోంది. అనేక రకాల మార్పులు, అవకాశాలు, ఫ్యాషన్లు ఆ రంగంవైపు ఆకర్షిస్తున్నాయి. యువతలో పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని శిక్షణా సంస్థలు కూడా విస్తరిస్తున్నాయి. కొత్త కొత్త కోర్సుల్ని ప్రవేశ పెడుతున్నాయి. మంచి డిమాండ్ ఉండటంతో వాటిని చదివేందుకు యువతీ యువకులు ఇష్టపడుతున్నారు. మరి ఫ్యాషన్ డిజైనింగ్‌లో వస్తున్న మార్పులేమిటి? ఏయే కోర్సులున్నాయి? ఎక్కడ చదవాలి? ఎలాంటి అవకాశాలు లభిస్తున్నాయి? తదితర విషయాలు తెలుసుకుందాం.
మారుతున్న పరిస్థితుల్లో యువత దేనివైపు మొగ్గుచూపుతుందో అదో క్రేజ్‌గా, ట్రెండ్‌గా చెలామణి అవుతుంది. దానినిబట్టి అప్పట్టి ఫ్యాషన్ రూపొందుతుంది. దీనివల్ల అనేక కొత్త అవకాశాలు కూడా పుట్టుకొస్తాయి. ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఇది కనిపిస్తోంది. ఈ రంగంలోకి అడుగు పెట్టిన వారికి చక్కటి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తున్నాయి. ఇందులో ప్రవేశించాలనుకున్నవారికి ఎన్నో రకాలు కోర్సులు, ట్రెయినింగ్ సెంటర్లు, ఇన్‌స్టిట్యూట్‌లు అందుబాటులో ఉన్నాయి. మన దేశం జౌళి వస్త్రాల ఎగుమతులూ...దిగుమతుల కేంద్రంగా భాసిల్లులోంది. కొత్తకొత్త రకాల వస్త్రాల రూపకల్పనలోనూ ముందుంది. ఫలితంగా దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఫ్యాషన్ డిజైనింగ్‌కు ప్రత్యేకత సంతరించుకుంటోంది.
ఫ్యాషన్ రంగలో డిజైనింగ్, కాన్సెప్ట్ మేనేజ్‌మెంట్, క్వాలిటీ కంట్రోల్, ప్లానింగ్, ఫేబ్రిక్ డిజైనింగ్, ప్రింటింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ మర్చంటైజింగ్, కలర్ మాక్సింగ్, టెక్స్‌టైల్ సైన్సెస్, మార్కెటింగ్ లాంటి ప్రొఫెషనల్స్ ఎన్నోవున్నాయి. ప్రాథమికంగా మార్కెట్ రీసెర్చ్, డిజైనింగ్ మాన్యుఫేక్చరింగ్ ఆఫ్ గార్మెంట్స్ అండ్ టెక్స్‌టైల్స్ ముఖ్యమైనవి.
ఫ్యాషన్ డిజైనింగ్ రోజురోజుకూ కొత్తమలుపు తిరుగుతుందంటే అందుకు ప్రధాన కారణం ఆ రంగంలో నైపుణ్యంతోపాటు సృజనాత్మకత ఎంతో ముఖ్యం. అప్పటి మార్కెట్‌నుబట్టి, ట్రెండ్‌నుబట్టి కొత్తకొత్త డిజైన్‌లను రూపొందించడంలో ఇదెంతో ప్రధానపాత్ర పోషిస్తోంది.
ఎన్నో రకాలు
ఫ్యాషన్‌లో వివిధ రకాలున్నాయి, గార్మెంట్స్, ఫుట్‌వేర్స్, జ్యువెలరీతో పాటు అనేక రకాల డిజైనింగ్స్ ఉంటాయి. అవసరాలకు అనుగుణంగా కొత్తవి కూడా వస్తుంటాయి. ఫ్యాషన్... ఇదో గొప్పకళ. ఇందులో రాణించాలంటే సృజనాత్మకత, సమయస్ఫూర్తి, మారుతున్న పరిస్థితులపట్ల అవగాహన ఎంతో అవసరం. అంటే ఇది కూడా మేధస్సుకు సవాలుగా నిలుస్తున్న రంగమన్నమాట. ఇందులో వృత్తులవారి సమన్వయం కూడా చాలా అవసరం.
పెద్దపెద్ద సంస్థల్లో ఒకొక్కరికీ ప్రత్యేకమైన ఉద్యోగం కేటాయిస్తారు. తయారుచేసే విధానంలో డిజైనింగ్‌కు కావలసిన టెక్స్‌టైల్స్, ఫేబ్రిక్స్ కొనాల్సి వుటుంది. తర్వాత తయారు చేసేందుకు చాలా మంది నైపుణ్యంగల నిపుణులు ఉంటారు.
విద్యారంగంలో ఫ్యాషన్ టెక్నాలజీకి మంచి డిమాండ్ వుంది. చదువుకునేటప్పుడే విద్యార్థులు తమ ప్రతిభకు, మేధస్సుకు పదును పెట్టే అవకాశం వుంటుంది. డిజైనింగ్ తయారీలో ట్రయినింగ్‌తోపాటు వస్త్రాల రూపకల్పనలో సృజనాత్మకత మేళవించడం నేర్చుకుంటారు.
ఆకర్షణీయంగా
ఏ రంగంలో రాణించాలనుకుంటారో ముందు దానిపైన ఆసక్తి ఉండాలి. ఆ తర్వాత కృషి, పట్టుదల ఎంతో ముఖ్యం. ఆత్మవిశ్వాసం, భిన్న పరిస్థితుల్లో ఒదిగిపోవడం, సృజనాత్మకత ప్రదర్శించండం, ట్రెండును ఫాలో అవడం ఫ్యాషన్ రంగంలో ఉన్నవారికి తప్పక ఉండాల్సిన లక్షణాలు. ఇవేగాక రంగులపై అవగాహన, టెక్నికల్ సామర్థ్యం, అందరితో కలిసిపోయేతత్వం ఉండాలి. ట్రయినింగ్ సమయంలో చేసిన పనే అయినా విసుగు చెందకుండా మళ్లీ అవసరమైనప్పుడల్లా చేయగలగాలి. అందంగా, ఆకర్షణీయంగా డిజైన్లను చిత్రించటంలో నైపుణ్యం ప్రదర్శించగలగాలి.
ఏయే కోర్సులు
ఫ్యాషన్ కెరీర్లోకి ప్రవేశించాలనుకునే వారికి గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, డిప్లొమా ఇంకా అనేక రకాల కోర్సులున్నాయి. అవి:
ఆక్సెసరీస్ డిజైనింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్.
గార్మెంట్స్ మేన్యుఫాక్చరింగ్ టెక్నాలజీ.
అపారెల్ మార్కెటింగ్ అండ్ మార్చండైజింగ్.
లెదర్ అండ్ గార్మెంట్ డిజైనింగ్ అండ్ టెక్నాలజీ.
నిట్‌వేర్ డిజైన్ అండ్ టెక్నాలజీ.
టెక్స్‌టైల్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్.
ఫ్యాషన్ జర్నలిజం అండ్ ప్రెజెంటేషన్.
శిక్షణ ఎక్కడీ
ఫ్యాషన్ శిక్షణలో భాగంగా విద్యార్దులకు సంస్థల్లో పనిచేసే అవకాశమూ ఉంటుంది. కాబట్టి లైఫ్‌లో స్థిరపడేవారికి ఇదో చక్కటి అవకాశం. ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లల్లో అధునాతనమైన పరికరాలు, లాబ్స్, వర్క్‌షాప్‌లూ, డిజైన్ అండ్ రీసెర్చ్ సెంటర్లూ, లైబ్రరీలూ, కంప్యూటర్లూ విద్యార్థుల అభివృద్ధికి ఎంతో దోహదపడతాయి.
సంస్థలు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ (ఎన్‌ఐడి)
ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజి. న్యూఢిల్లీ (ఐఐఎఫ్‌టి)
ఐఇసి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఫ్యాషన్, న్యూఢిల్లీ.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజి. ముంబయి. (ఐఐఏఎఫ్‌టి) .
పీర్ల అకాడెమి ఆఫ్ ఫ్యాషన్, న్యూఢిల్లీ ్ల.
జె.డి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, న్యూఢిల్లీ .
అర్హతలు
అండర్ గ్రాడ్యుయేషన్‌కు కనీసం 10+2 లో 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
గ్రాడ్యుయేట్స్‌కు మాత్రం పెద్దపెద్ద సంస్థల్లో
మెరిట్ ప్రకారం ప్రవేశం వుంటుంది.
ఎంపిక
రాతపరీక్ష, గ్రూప్‌డిస్కషన్, ఇంటర్యూ వుంటుంది. గ్రాడ్యుయేట్స్‌కు జ్యువెలరీ, లెదర్‌గూడ్స్, కాస్ట్యూమ్ డిజైనింగ్‌కు సంబంధించినవి. అండర్ గ్రాడ్యుయేషన్‌కు ఆసిసరీస్ డిజైనింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఉంటుంది.
ఫ్యాషన్ కాలేజీలు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. (ఎన్‌ఐఎఫ్‌టి), హైదరాబాద్. ఫోన్: 3130843, 3110842.
అర్హత: 10+2, 50% మార్కులతో ఉత్తీర్ణత,
కోర్సు కాల పరిమితి: 3 సంవత్సరాలు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్స్‌టైల్ టెక్నాలజీ, నల్లపాడు, గుంటూరు-522005.
ఫ్యాషన్ టెక్నాలజీ పాలిటెక్నిక్ ఫర్ వుమెన్ చౌదరయ్యపేట్, గుంటూరు-522006.
ప్లేస్‌మెంట్స్
ఫ్యాషన్ కోర్సు పూర్తిచేసిన విద్యార్ధులకు ఆయా సంస్థలు ప్లేస్‌మెంట్ అవకాశం కూడా కల్పిస్తన్నాయి. గార్మెంట్స్, లెదర్, జ్యువెలరీ వంటి సంస్థల్లో ఉద్యోగం పొందొచ్చు. ఫ్యాషన్‌రంగం గ్లామర్‌తో ముడిపడివుంది కాబట్టి దీనికి డిమాండ్ ఎక్కువ. ఇది సృజనాత్మకతమీద ఆధారపడివుంది కాబట్టి చాలామంది డిజైనర్స్ ఎలాంటి కోర్సులూ చేయకుండా అనుభవం ద్వారా ఫలితాలు సాధించిన వారూ ఉన్నారు. అయితే మారుతున్న పరిస్థితుల్లో కోర్సులు చేయడం, శిక్షణ పొందడం చాలా అవసరం. మంచిపేరుతోపాటు డబ్బుసంపాదించే రంగంగా ఫ్యాషన్ డిజైనింగ్ ముందుంది.
జీత భత్యాలు
వివిధ సంస్థల్లో ఫ్యాషన్ డిజైనింగ్ నిపుణులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలతోపాటు ఆకర్షణీయమైన వేతనాలు కూడా ఉంటాయి. ప్రారంభంలో 4 నుంచి 6 వేల వరకు ఉంటుంది. అనుభవం పెరిగే కొద్దీ 12 వేలనుంచీ 25 వేల వరకు జీతాలు ఉంటాయి.
No comments:
Post a Comment