Wednesday, February 2, 2011

ఇండియన్‌ టెక్నీషియన్స్‌ యానిమేషన్‌ మూవీ ఆల్ఫా అండ్‌ ఒమెగా

100 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. 2010లో అమెరికాలో విడుదలై 202.50 కోట్ల వసూలు చేసి రికార్ట్‌ సృష్టించింది. ముగింపులో మన ఇండియన్‌ టెక్నీషియన్స్‌ పేర్లు పడటంతో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందని క్రెస్ట్‌ యానిమనేషన్‌ సి.ఇ.ఓ. మాధవన్‌ మంగళవారంనాడు విలేకరులకు తెలియజేశారు.
చిత్ర వివరాలను తెలియజేస్తూ...4న భారత్‌లో విడుదలకా బోతుందన్నారు. భారత్‌లో రూపుదిద్దుకున్న తొలి 3-డి స్టీరియో స్కోపిక్‌ సీజీఐ (కంప్యూటర్‌ జనరేటెడ్‌ ఇమేజరీ) చిత్రం కావడం ఆనందంగా ఉందన్నారు. భారతదేశంలో 70 థియేటర్లలో విడుదల కానున్నందని వెల్లడించారు. దాదాపు 30 దేశాల్లో విడుదలై భారతీయులు గర్వపడేలా చేసిందన్నారు. సాంకేతిక కారణాలవల్ల ఈ ఏడాది మన దేశంలో విడుదల కానున్నదన్నారు. ఈ ఏడాది జులైలో తెలుగు వర్షన్‌ రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

మరో యానిమేషన్‌ సంస్థకు చెందిన రాజశేఖర్‌ మాట్లాడుతూ...ముంబైలోని టెక్నీషియన్స్‌తో రూపొందిన ఈ చిత్రంలో పనిచేసింది తెలుగువారేనని, క్రెస్ట్‌ యానిమేషన్‌ లాస్‌ఏంజెల్స్‌లో ఉందనీ, బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్‌ కొంత అక్కడ జరిగిందని అన్నారు.

No comments:

Post a Comment