1983 ప్రపంచ కప్‌లో కపిల్ డెవిల్స్‌కు ఆరంభం నుంచే అచ్చొచ్చింది! రెండుసార్లు ప్రపంచ కప్ గెలిచి హ్యాట్రిక్ బరిలో నిలిచిన విండీస్ జట్టుపై తొలి మ్యాచ్‌లోనే భారత్ గెలిచి సంచలనం సృష్టించింది. మొదట మన జట్టు 8 వికెట్లకు 262 పరుగులు చేసింది. యశ్‌పాల్‌శర్మ (89) రాణించాడు. లక్ష్యసాధనలో బిన్ని (3/48), రవిశాస్త్రి (3/26) సత్తా చాటడంతో విండీస్ 228 పరుగులకే ఆలౌటైంది. ప్రపంచ కప్‌లో విండీస్‌కు అదే తొలి ఓటమి! ఈ విజయమే భారత్‌కు ప్రపంచ కప్ ఫైనల్లో విండీస్ మీద గెలవగలమన్న విశ్వాసాన్ని అందించింది. విండీస్ రెండుసార్లూ లక్ష్యఛేదనలో విఫలమై పరాజయం పాలుకావడం మరో విశేషం.
No comments:
Post a Comment