ప్రతి ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా టీవీల్లో, రేడియోల్లో వినిపించే.. ‘గాంధీ పుట్టిన దేశమా ఇది.. నెహ్రూ కోరిన సంఘమా ఇది’ అనే పాట కూడా ఈ చిత్రంలోనిదే కావడం విశేషం! అక్కినేని నటించిన ఆణిముత్యంలాంటి సినిమాల్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గ సినిమా ‘పవిత్రబంధం’. అక్కినేని సరసన వాణిశ్రీ, కాంచన హీరోయిన్లుగా నటించారు. రసాలూరు సంగీతాన్నందిస్తారనే ప్రతీతి కలిగిన సాలూరు రాజేశ్వర్రావు ఈ చిత్రానికి అజరామరమైన సంగీతాన్ని అందించారు. ‘పచ్చబొట్టూ చెరిగీ పోదులే’ అనే పాట నేటికీ టీవీల్లో, ఎఫ్.ఎమ్‌లలో వినిపిస్తూ సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగిస్తూనే ఉండడం మనకు తెలిసిందే. అశోక్ మూవీస్ పతాకంపెై ‘విక్టరి’ బిరుదాంకితులు వి.మధుసూదనరావు దర్శకత్వంలో టి.గోవిందరాజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం 1971 ఫిబ్రవరి 25న విడుదలెైంది. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్రదినోత్సవాల సందర్భంగా టీవీల్లో, రేడియోల్లో వినిపించే.. ‘గాంధీ పుట్టిన దేశమా ఇది.. నెహ్రూ కోరిన సంఘమా ఇది’ అనే పాట కూడా ఈ చిత్రంలోనిదే కావడం విశేషం. ఒక కుటుంబ కథాచిత్రంలో దేశభక్తిని ప్రబోధిస్తూ.. యువతను మేల్కొలిపే స్ఫూర్తివంతమైన గీతాన్ని పొందుపరచడం బట్టి.. అప్పటి దర్శకనిర్మాతల ఉత్తమాభిరుచిని అర్ధం చేసుకోవచ్చు, అభినందించవచ్చు.
ఈ చిత్రంలోని పాటలకు ఘంటసాల-సుశీల జీవం పోయగా, పిఠాపురం-స్వర్ణలతలు కూడా ఈ చిత్రం కోసం ఆలపించారు. ఈ చిత్రానికి రచన చేసిన ఆరుద్ర.. ఈ చిత్రంలో దాదాపుగా అన్ని పాటలూ రాసారు. ఒకటి రెండు పాటలు మాత్రం కొసరాజు రాసారు. ఇకపోతే, ఈ చిత్రంలో, అనంతరకాలంలో రెబల్‌స్టార్‌గా ఎదిగిన కృష్ణంరాజు కూడా నటించడం విశేషం. గీతాంజలి, పద్మనాభం, వి.నాగయ్య, జి.వరలక్ష్మి ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
ఒక చిత్రం గురించి 40 ఏళ్ల తర్వాత కూడా చర్చించుకుంటున్నామంటేనే ఆ చిత్రం ఎంతటి జనరంజకమైనదో అర్ధం చేసుకోవచ్చు!

No comments:
Post a Comment