Friday, February 11, 2011

ఫాన్స్‌ను హింసిస్తున్న 'మెగా' బ్రదర్స్‌!

ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నన్న నేపథ్యంలో.. అభిమానల నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ముందు జాగ్రత్త మెగ బ్రదర్స్‌ చిరంజీవి, పవన్‌ కళ్యాన్‌ అభిమానులతో భేటీ అవుతున్నారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పవన్‌ కళ్యాణ్‌ తన అభిమానులతో సమావేశం అవుతుండగా.. చిరంజీవి తన నివాసం వద్ద అభిమానులను కలుస్తున్నారు.
ఆభిమానుల ఆకాక్ష మేరకే రాజకీయాల్లోకి వచ్చాను అని ఇన్నాళ్లు చెప్పుకున్న చిరంజీవి.. ఇప్పుడు కాంగ్రెస్‌లో విలీనం అవుతుండటం కొందరు అభిమానులక రుచించడం లేదు. అవినీతి మయం, నీతిమాలిన, సిగ్గుమాలిన పార్టీగా పేరుగాంచిన కాంగ్రెస్‌లోకి.. చిరంజీవి సిగ్గు లేకుండా పోవడం ఏమిటని కొందరు అభిమానులు బహిరంగంగానే ప్రశ్సిస్తున్నారు. ఈ నేపథ్యంలో .. వచ్చే నెలలో చిరంజీవి భారీ ఎత్తున ఏర్పాటు చేయబోతయే విలీన సభకు ఎలాంటి ఆటంకం కలగించకుండా ఫ్యాన్స్‌ను మేనేజ్‌చేయడంతో.. అభిమానులు కూడా పీఆర్పి విలీనాన్ని స్వాగతిస్తున్నారు. అని చెప్పుకోవడానికి.. మెగా బ్రదర్స్‌ ఈ భేటీ ప్లాన్‌ చేసినట్లు సృష్టం అవుతోంది. అయితే.. కొందరు అభిమానలు చిరంజీవి వైఖరిని తపుకతప్పు పడుతున్నారు. నీ స్వార్థం కోసం నువ్వు చెడిపోయావు(కాంగ్రెస్‌లో విలీనం అవుతుందటం) మీరు వెళ్లిన చెడు దారిలో మమ్మల్సి రమ్మనడం మాపై ఒత్తిడి తేవడం, ఒకరిద్దరిని కొనేసి మొత్తం ఫ్యాన్స్‌ అంతా తమ వెంటపననే ఉన్నారని చెపుకోవడం చిరంజీవికి తగువా? ఇలా చేయడం అభిమానులను మానసిక హింసకు గురిచేయడం కాదా? అన్ని ప్రశ్నిస్తున్నారు.

No comments:

Post a Comment