Friday, February 25, 2011

తోటకూరతో పొడి కూర

కావలసిన పదార్థాలు
తోటకూర - 8 కట్టలు, పచ్చిమిర్చి - 4
పెసరపప్పు - 3 స్పూన్లు,, కొత్తిమీర - చిన్న కట్ట
కరివేపాకు - 2 రెమ్మలు, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు
కారం - 1 స్పూన్‌, పోపు సామాను - 1 స్పూన్‌తయారు చేసే విధానం
పచ్చిమిర్చిని పొడవుగా తరగాలి. తోటకూరను సన్నగా తరగాలి. పెసరపప్పును నానబెట్టాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చితో పోపు పెట్టుకోవాలి. అందులోఉప్పు, పసుపు, కారం, నానబెట్టిన పెసరపప్పు వేసి మూత పెట్టి కొద్ది సేపు ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి మరి కొద్దిసేపు కూరని కలియబెడుతూ నీరు ఇంకిపోయేవరకు వేగనివ్వాలి. ఇలాగే పాలకూర, కందికూరను కూడా చేసుకోవచ్చు.

1 comment: