Wednesday, February 16, 2011

బాబాయ్ కి అబ్బాయ్ బంపర్‌ ఆఫర్‌..

కడప జిల్లా బాబాయ్ (వివేకా)- అబ్బాయ్ (జగన్‌)లు. అధికార దాహంతో విడిపోయారు. ఒకాయ నేమో మంత్రి పదవి కోసం కాంగ్రెస్‌ గూట్లోనవనే ఉండి పోతే.. మరొకాయనేమో సిఎం సీటు పైనే కన్నేసి కొత్త పార్టీ పెట్టబోతున్నాడు. రక్తసంబంధీకులే అయినా పదవుల పందెంలో ప్రత్యర్థులుగా మారారు. ఒకరిపై ఒకరు మీసాలు మెలేసే వరకు వెళ్లింది. వ్యహారం.ఈ మధ్యంలో బాబాయ్  కి అబ్బాయ్  ఆహ్వానం పంపడం చర్చనీయాంశమైంది. తను పెట్టబోయే పార్టీలోకి బాబాయ్  వస్తానంటే స్వాగతిస్తానని జగన్‌ వాఖ్యనించారు.

కడప ఉప ఎన్నికల్లో జగన్‌కు వ్యతిరేకంగా వివేకా తన అల్లుడితో బరిలోకి దిగుతుండటంతో వైఎస్‌ బంధువులు ఇద్దరి మధ్య రాజీకుదర్చడానికి, అవసరమైతే ఇద్దరినీ కలపడానికి మరోసారి ప్రయత్నించారు. ఈమేరకు కడపలోని వైఎస్‌, ప్రకాష్‌రెడ్డి ఇంట్లో జగన్‌తో సమావేశం అయ్యాడు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. బాబాయ్ తనతో వస్తానంటే స్వాగతిస్తాను, అవసరమైతే బాబాయ్ ని  తమ అవసరమైతే బాబాయ్ ని తమ పెట్టబోరు పార్టీ తరుపున పోటీకి దించుతాను అని జగన్‌ సృష్టం చేసినట్టు సమాచారం మరికొన్ని రోజుల్లో కూలిపోయే కాంగ్రెస్‌నే అంటిపెట్టుకుని ఉన్న వివేకానందరెడ్డికి.. ఈ ప్రతిపాన ‌బంపర్‌ ఆఫర్‌గా పేర్నొంటున్నారు. జగన వర్గీయులు. వివేకా జగన్‌ వెంటరావాలని, జగన్‌ పెట్టబోయే పార్టీలో పెద్దన్న పాత్ర పోషించాలని కోరుతకుంటున్నారు.

No comments:

Post a Comment