ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుందే..! అనుకుంటున్నారా ! అవునండీ ఈవిడ మలయాళ నటి రోహిణి. పలు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. ఆవిడ నటించిన తాజా చిత్రం 'అలా మొదలైంది' ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషలను ధారాళంగా మాట్లాడగలిగే బహుముఖ ప్రజ్ఞాశాలి. చాలా గ్యాప్ తర్వాత తెలుగు తెరపై కనిపించారు. ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ...' తమిళంలో దర్శకురాలు అంజు, నందినీరెడ్డి ఇద్దరూ మంచి స్నేహితులు. అంజు వద్ద నందినీరెడ్డి కొన్ని సినిమాలకు పనిచేసింది. కథ చెప్పినప్పుడు తల్లి పాత్ర కొత్తగా అనిపించింది. ఈ తరంలో తల్లి పాత్ర ఎలా ఉంటుంది? అనేది బాగా చూపించింది. మహిళా దర్శకురాలిగా ఆమెకు సపోర్ట్ చేయాలని ఈ చిత్రంలో నటించా. అంతకుముందు గుణశేఖర్, దిల్‌రాజు వంటి వారు తల్లి పాత్రల కోసం అగిగారు. కొత్తబంగారులోకం తరహాలోనే ఆ పాత్ర ఉండటంతో సున్నితంగా తిరస్కరించా. మలయాళంలో రియలస్టిక్ మూవీస్ బాగా వస్తాయి. నటనలో పాఠాలు అక్కడే నేర్చుకున్నా. కల్పితాలు చాలా తక్కువ.
'అలా మొదలైంది'లో నా పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఇటీవలే కూకట్‌పల్లిలో ఓ ధియేటర్‌లో చూశాను. ప్రేక్షకులా చాలా ఎంజారు చేస్తున్నారు. నేను చేసిన పాత్ర మహిళలకు చాలా నచ్చింది. తమిళంలో కొన్ని నాటకల్లో పనిచేస్తున్నా. నాటకాల అనుభవం అత్యంత ముఖ్యమైంది. 'విలన్'లో ఐశ్వర్యకు డబ్బింగ్ చెప్పా. తమిళంలో ఓ చిత్రానికి దర్శకత్వం చేయాలనే ఆలోచనను వ్యక్తం ఉంది. స్క్రిప్ట్ సిద్దంగా ఉంది. థ్రిల్లర్ మూవీ చేయాలనుంది. భరతన్, మలయాళ దర్శకుడు దేవరమగన్ నాకు బాగా నచ్చిన దర్శకులు. తెలుగులో మాయాబజార్ గొప్ప చిత్రం.
రోహిణి మలయాళంలో నటించినా తెలుగమ్మాయే...తెలుగులో బాలనటిగా చాలా సినిమాలు చేసింది.ఆమె స్వస్థలం రాజమండ్రి దగ్గరలోని గ్రామం.
ReplyDelete