జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే అన్న సామెత ఇలాంటి వారిని చూశాకే వచ్చి వుంటుంది. 'అమ్మో ఇంత పొడవు కురులా! చక్కగా తల స్నానం చేసి జడ వేసుకొని ఇన్ని కనకాంబరాలు పెట్టుకుంటే వుంటుందీ! అదిరిపోతుంది...' అనుకుంటున్నారా! ఇలా చూసి ఆనందించడానికి బానే వుంటుంది. అయితే అంత పొడవు జుట్టు వుంటే గానీ సమస్యలేంటో తెలియవంటోంది చెంగ్ షికన్. మధ్యలో ఈవిడెవరు? అనుకోకండి. ఫొటోలో కనిపిస్తున్న కేశ సుందరే చెంగ్. పేరు వింటేనే తెలుస్తోందికదా ఈమెది చైనా అని. ఆమె ఒక బ్యూటీ పార్లర్ యజమానురాలు. మరో విషయం ఏమంటే ఆమె వయసు యాబై రెండేళ్లు. ఇంతకీ ఆమె కేశాల పొడవు ఎంతనుకుంటున్నారు? ఆ...ఎంతా! సింపుల్‌గా 2.5 మీటర్లే. తల స్నానం చేయాలంటే రెండు గంటలు, చిక్కు తీయడానికి అర్ధగంట పడుతుందట. మరి ఇంత సమయం వెచ్చించి కురులను కాపాడుకోవాలంటే చాలా ఓర్పు వుండాలికదూ.
No comments:
Post a Comment