ఏదైనా పౌరాణికాలు పాత్ర వేయాలంటే.. స్వర్గీయ ఎన్.టి.ఆర్. చాలా నియమనిష్టలతో ఉండేవారట. దాన్ని చాలామంది అనుసరించినా.. ఆ పాత్రలు పోషిస్తుంటే.. కొన్ని ఉపద్రవాలు వస్తుంటాయి. అప్పట్లో ఎన్.టి.ఆర్ శివుడు పాత్రను పోషిస్తే... ఆయన తనయుడు రామకృష్ణ హఠన్మరణం పొందారు. దాంతో శివుడు పాత్రను చేయాలంటే... ఆ తర్వాత తరం నాయకులు సాహసం చేసేవారు కాదు. చిరంజీవి కొన్ని చిత్రాల్లో చేసినా అది ఒక బిట్ వరకే ఉండేది. అసలే సెంటిమెంట్ ఇండస్ట్రీలో కొన్ని సంఘటనలు తగినట్లు జరుగుతుంటాయి.
నాగార్జున "అన్నమయ్య" షూటింగ్ జరుగుతుండగా... ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్స్ ఇన్‌ఛార్జ్ హఠాన్మరణం పొందారు. ఇక బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా చేయడానికి కంకణం కట్టుకున్న 'నర్తనశాల' షూటింగ్ జరుగుతుండగా... హీరోయిన్ సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు.
అంతకుముందు బాలకృష్ణ ఇంతకంటే ప్రతిష్టాత్మకంగా ఎస్.గోపాల్‌రెడ్డి చిత్రం చేయడానికి ఏళ్ళ తరబడి వేసిన వైజాగ్‌లో సెట్లుకు కోట్లు రూపాయలు పెట్టి లాస్ అయి... చివరికి బాలకృష్ణకు, నిర్మాతకు అభిప్రాయభేదాలు రావడంతో.. ఆయన అనారోగ్యం పాలయి... మరణించాడు. చనిపోయే ముందు కూడా తను బాలయ్యతో సినిమా తీయలేకపోయానని బాధపడ్డారు.
కట్‌చేస్తే... ఇటీవలే.. శ్రీరామరాజ్యం చిత్రం షూటింగ్ జరుగుతుండగా... చిత్రకథకు గుండెకాయలాంటివాడు.. ముళ్లపూడి రమణగారు చనిపోవడం... పెద్ద షాక్... ఇండస్ట్రీలో ఇటువంటి సెంటిమెంట్లు చాలానే ఉన్నాయి.

No comments:
Post a Comment