మీకు ఆఫీసులో లక్ష్యాలున్నట్లే పిల్లలు స్కూలు కెళ్ళి పరీక్షలు రాసి పాసవ్వాల్సి ఉంటుంది. మీరు మీ లక్ష్యాలు చేరుకోవాలని ఆశించినట్లే పిల్లలు కూడా పరీక్షలలో ఉత్తీర్ణులవ్వాలనుకుంటారు. ఇవన్నీ జీవితం లో భాగం.
జయాపజయాలు కూడా అంతే. కానీ విజయం సాధించినప్పుడు మనందరికీ సంతోషం వస్తే అపజయం పాలయినప్పుడు నిరాశా, నిస్పృహలు చుట్టుముడతాయి. చిన్నపుడు పరీక్షలలో తప్పితే భంగపాటుకి గురవ్వడం సహజం.మీ పిల్లలు ప్రతీ పరీక్షలోనూ మంచి మార్కులే తెచ్చుకోవాలన్న ఒత్తిడి కి లోనవ్వుతుంటే భంగపడక తప్పదు.నిరాశ లో ఉన్న పిల్లవాడిని ముందు ఊరడిల్లచేసి అపజయమొచ్చినప్పుడు ఎలా దానిని ఎదుర్కోవాలో వివరించాలి.భంగపాటుని ఎలా ఎదుర్కోవాలో కింద మరింత వివరంగా ఇచ్చాము చదవండి. పిల్లలకి పరీక్షలలో అపజయమెదురయినప్పుడు భంగపడితే ఎలా సంభాళించాలి??
1.అంగీకరించడం నేర్పండి పిల్లలలో అయినా పెద్దవారిలో అయినా వాస్తవాన్ని అంగీకరించి నిజాలని ధైర్యం గా ఎదుర్కోగలిగితే భంగపాటుని కొంతవరకూ నివరించగలము.మీ పిల్ల లేదా పిల్లవాడికి పరీక్షలలో తక్కువ మార్కులొస్తే వాస్తవాన్ని అంగీకరించమని చెప్పండి. సగటు మార్కులు ముఖ్యమనీ, సబ్జెక్టుల వారీగా విడి విడి మార్కులు తక్కువొస్తే అంతా అయిపోయిందనుకోవడం సరైన పద్ధతి కాదనీ విడమరచి చెప్పండి.మీ పిల్లలు చదువుకోవడాన్ని ఆస్వాదించగలగాలి.చదువు ద్వారా వచ్చే మార్కుల కంటే ఙానాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం.
2 సహనం సహనం ద్వారా భంగపాటుని చాలా వరకూ ఎదుర్కోవచ్చు.సహనం ఎంత ముఖ్యమో, దాని ప్రాముఖ్యత ఏమిటో వారికి అర్ధమయ్యేలా విడమరచి చెప్పండి.
3. భవిష్యత్తులో పరిస్థితి బాగుపడుతుందన్న భరోసా పరీక్షలలో ఒక్కసారి తక్కువ మార్కులొచ్చినంత మాత్రాన ఏమీ అయిపోదు. మరలా అవకాశం వస్తుందనీ అప్పుడు జరిగిన తప్పు సరిదిద్దుకోవచ్చనీ చెప్పండి.తక్కువ మార్కులొచ్చినప్పుడు భంగపడి నిరాశ లో కూరుకుపోవడం కంటే వాస్తవాన్ని అంగీకరించి రాబోయే పరీక్షకి సన్నద్ధమవ్వమని చెప్పాలి. ఇవండీ పరీక్షల తరువాత పిల్లలలో ఎదురయ్యే భంగపాటుని ఎదుర్కోవడానికి కొన్ని సలహాలు. మీకు ఇంకేమైనా తెలిస్తే కనుక మాతో పంచుకోండి.

No comments:
Post a Comment