Thursday, October 8, 2015

మీ పిల్లలకి వికారం,వాంతులా?? ఏమై ఉండొచ్చు??

                             
మీ పిల్లలకొచ్చిన వికారం తగ్గకపోగా వాంతులకి దారి తీసిందా?? కొంచెం మోతాదులో అయ్యే వాంతులు ప్రమాదకరం కాదు. అవి త్వరగానే తగ్గిపోతాయి.సాధారణంగా పొట్టలో వైరుస్ చేరడం వల్ల కానీ ఆహారం
విషతుల్యమవడం వల్ల కానీ వాంతులకి గల సాధారణ కారణాలు.మీ పిల్లవాడి వయసు 12 వారాలకంటే తక్కువైనా లేదా పిల్లల వాంతులతో మీరు కంగారు పడుతున్నా వైద్యుడిని సంప్రదించండి.
డీహైడ్రేషన్ లక్షణాలు: వాంతులవుతోంటే కనుక మీ పీల్లలలో డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తున్నాయేమో చూడండి.పెద్ద వారితో పోలిస్తే పిల్లలు త్వరగా డీ హైడ్రేట్ అవుతారు. మీ పిల్లవాడు అలసిపోవడం లేదా తిక్కగా ఉన్నా, నోరు ఎండిపోవడం,ఏడ్చినప్పుడు కొద్ది మోతాదులో మాత్రమే కన్నీరు రావడం,కాళ్ళ వాపు,ఒళ్ళు చల్లగా ఉండటం, మామూలు కంటే తక్కువ సార్లు మూత్ర విసర్జన, మూత్ర విసర్జన సమయంలో అతి తక్కువ మూత్రం రావడం లేదా మూత్రం చిక్కటి పసుపచ్చగా ఉండటం లాంటి లక్షణాలు డీహైడ్రేషన్ ని సూచిస్తాయి.

No comments:

Post a Comment