Tuesday, September 15, 2015

మీరు నిద్రలేమితో బాధపడుతున్నారా?

కల నిద్రతో ఇబ్బంది పడుతున్నారా. నిద్రలేమి లేదా కలత నిద్ర అనేక వ్యాధులకు మూలం. ముఖ్యంగా అధిక రక్తపోటు, నిలకడేలని మనస్సు, అధిక బరువు వంటి వ్యాధులకు కారణం అవుతుంది. ఒక్కో సందర్భంలో వర్క్
ప్రెజర్ వల్ల రాత్రుల్లో మేల్కోవల్సి వస్తుంది. అది మీ నిద్రవ్యవస్థకు భంగం కలిగిస్తుంది. నిద్రించే టైమింగ్స్ లో మార్పులు వస్తాయి. దాంతో నిద్రలేమి తిరిగి ప్రారంభమవుతుంది. నిద్రలేమి వల్ల అధిక ఒత్తిడికి గురి అవ్వడం మాత్రమే కాదు, మీరు మరుసటి రోజు మీ పని మీద దృష్టి పెట్టటానికి కూడా కష్టం అవుతుంది.
స్మోకింగ్ హ్యాబిట్స్: అపోహలు-వాస్తవాలు..! ఈ సమస్యను నివారించుకోవడానికి కఠినమైన చికిత్సలు మరియు మందులు వాడకుండా మీకు మీరే నేచురల్ గా చికిత్సనందించుకోవాలనుకుంటే, మీరు తీసుకొనే డైట్ మీద ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. ఈ నేచురల్ పద్ధతి ద్వారా కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవడం ద్వారా మీ స్లీప్ ప్యాట్రన్(నిద్రను) నార్మల్ చేస్తుంది. మరియు నాడీవ్యవస్థను ప్రశాంత పరుస్తుంది. సమయానికి నిద్రపట్టేలా చేస్తుంది.

No comments:

Post a Comment