Sunday, December 28, 2014

గర్భిణీ స్త్రీలలో సాధారణ ఆరోగ్య సమస్యలు:నివారణ


     ఏ మహిళైనా తాను తల్లి కాబోతున్నానన్న వార్త తెలియగానే సంతోషంతో ఉప్పొంగిపోతుంది. అయితే ఈ సమయంలో ఏర్పడే శారీరక మార్పులు కొందరు మహిళలను ఆందోళనకు గురిచేస్తాయి. డెలివరీ తర్వాత బరువు పెరగడం, జుట్టు రాలడం, పొట్ట భాగంలో తెల్లని చారలు ఏర్పడటం..లాంటి సమస్యలు చాలా మందిలో సహజమే. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీటి తీవవ్రతను తగ్గించుకోవచ్చు. అదెలాగో చూద్దాం.....

గర్భం పొందిన తర్వాత మహిళల్లో ఎన్నో సానుకూల మార్పులు వస్తాయి . శరీరం మునుపటి కంటే ప్రకావశంతమువుతుంది. జుటమటు మెరుస్తుంది. ఇలా జరగడానికి కారణం ఈస్ట్రోజన్ అనే హార్మోనే. గర్భిణులు పరిపుష్టిగా మారడానికి ఈ హార్మోన్ చాలా వరకూ దోహడం చేస్తుంది. అయితే ప్రసవానంతరం ఈస్ట్రోజన్ మునుపటి స్థాయికి చేరుకుంటుంది. శరీరంలో కొత్త మార్పులు సంతరించుకుంటాయి. దీంతో బరువు పెరగడం, చర్మం సాగినట్టు అనిపించడం ముఖంలో నిండుదనం కోల్పోవడం, పొట్టపై చారలు, జుట్టు రాలడం...లాంటి సమస్యలు ఎక్కువ మందిలో కామన్ గా కనిపిస్తాయి.
గర్భిణీ స్త్రీలలో సాధారణ ఆరోగ్య సమస్యలు:నివారణ
1. సమస్య: జుట్టు రాలిపోవడం 
గర్భధారణ సమయంలో ఎక్కువగా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ విడుదల కావడం వల్ల జుట్టు రాలే సమస్య చాలా వరకూ తగ్గిపోతుంది. కురుల నిగారింపు సంతరించుకోవడంతో జుట్టు ఏపుగా పెరిగి, ఒత్తుగా మారుతుంది. కానీ డెలివరీ తర్వాత చాలా మందిలో వెంట్రుకలు బలహీనమై జుట్టు బాగా రాలిపోతుంది.
పరిష్కారం: పౌష్టికాహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి. ఏవిధమైన రసాయన చికిత్సల జోలికి పోవద్దు. ముందు రోజు రాత్రి జుట్టుకు నూనె పట్టించి మరుసటి రోజు ఉదయం తక్కువ గాఢత ఉన్న షాంపుతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తే సరిపోతుంది. జుట్టుకు రంగు వేసే అలవాటు ఉన్నవాళ్ళు గర్బం దాల్చిన తొలి పన్నెండు వారాలు, అలాగే డెలివరీ తర్వాత కనీసం మూడు నెలల వరకైనా దాని జోలికి వెల్ళకపోవడమే మంచిది. దీని బదులు అవసరం అనుకుంటే మంచి నాణ్యత ఉన్న గోరింటాకును వాడొచ్చు. అలాగే హెయిర్ డ్రయ్యర్ తో ప్రమాదమేమీ లేకపోయినప్పటికీ ఇలాంటి సమయంలో దాని వాడకాన్ని పరిమితం చేసుకోవడమే మంచిది. జుట్టుకు ఎండ, వేడి ఎక్కువగా తగలకుండా చూసుకోవాలి. రబ్బరు బ్యాండ్లు, క్లిప్పులు లాంటివి ఉపయోగించినప్పుడు జుట్టును మరీ టైట్ గా కాకుండా కాస్త వదులుగా కట్టుకోవాలి.
గర్భిణీ స్త్రీలలో సాధారణ ఆరోగ్య సమస్యలు:నివారణ
2. సమస్య: స్ట్రెచ్ మార్క్స్
పరిష్కారం:
గర్భం పొందిన తర్వాత కడుపులో శిశువు పెరుగుదలకు వీలుగా శరీరం కూడా సాగుతుంది. దీంతో కొలాజన్ స్థాయిల్లో తేడాల కారణంగా కొన్ని చోట్ల చారలు ఏర్పడుతాయి. ఇలా ఏర్పడిన చోట ఆలివ్ ఆయిల్ ను కొద్దిగా వేడి చేసి రాయాలి. అలాగే థైరాయిడ్ సమస్య ఉన్నదేమో ఒకసారి చెక్ చేయించుకోవాలి.
గర్భిణీ స్త్రీలలో సాధారణ ఆరోగ్య సమస్యలు:నివారణ
3. సమస్య: చర్మం పొడిబారడం
పరిష్కారం:
గర్భిణీ స్త్రీలలో చర్మం పొడిబారినట్లైతే ఒక మంచి మాయిశ్చరైజర్ క్రీమ్ ను రాసుకుంటే సరిపోతుంది.
గర్భిణీ స్త్రీలలో సాధారణ ఆరోగ్య సమస్యలు:నివారణ
4. సమస్య: మొటిమలు
పరిష్కారం: గర్బం పొందిన తర్వాత మొటిమలతో బాదపడే గర్భిణీ స్త్రీలు సాలిసిలిక్ ఆమ్లం లేదా యాంటీబయోటిక్స్ ఉండే ఫేస్ వాష్ ను రాత్రి పడుకునే ముందు ఒకసారి ఉపయోగించాలి. ఈ సమయంలో ఫేషియల్స్ జోలికి వెళ్లడం మంచిది కాదు. సమస్య మరీ ఎక్కువగా ఉంటే డెర్మటాలజిస్ట్ ని సంప్రదించాలి.
5. సమస్య: వెరికోస్ వెయిన్స్
పరిష్కారం: ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరగడం సహజం. దీనివల్ల చాలా మందిలో కాళ్లలో నరాలు పైకి ఉబ్బినట్టు కనిపిస్తాయి. ఈ సమస్య ఉన్న వాళ్లు బాగా నడవడం, విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మజాతి పండ్లు తీసుకోవడం, కాళ్లు వంకరగా ఒకదానిపై ఒకటి వేయకుండా జాగ్రత్తపడడం..లాంటివి చేయాలి.
గర్భిణీ స్త్రీలలో సాధారణ ఆరోగ్య సమస్యలు:నివారణ
6. మరికొన్ని జాగ్రత్తలు: 
* మంచి నీళ్లు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే తాజా పండ్లు, కూరగాయలు తినాలి.
* మీ శరీర తత్వాన్ని బట్టి ఫేస్ వాష్ లేదా సబ్బు వాడవచ్చు. వారానికోసారి బాడీ స్ర్కబ్ ఉపయోగించవచ్చు.
* కొత్త ఫేషియల్స్ జోలికి పోవద్దు. మీ శరీరానికి సరిపోయేవే వాడండి.
* ఎండలోకి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరి. ముఖానికి ఏమీ రాసుకోకుండా అలాగే వెళ్లడం వల్ల అతినీలలోహిత కిరణాల దుష్ప్రభావం కారణంగా పిగ్మెంటేషన్ సమస్య వచ్చే అవకాశం ఉంది.
* ప్రెగ్నెన్సీ సమయంలోనూ, ఆ తర్వాత ఏడాది వరకూ వీలైనంత మేరకు రసాయనాల ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించుకోవాలి. కొత్తవాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఏవైనా సమస్యలుంటే సొంత వైద్యం కాకుండా డాక్టర్ సలహా తీసుకోవడమే శ్రేయస్కరం.
* చాలా మంది వాంతులతో ఇబ్బంది పడతారు. గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్లు చాలా తక్కువ పరిమానంలో ఎక్కువసార్లు ఆహారాన్ని తీసుకోవాలి. దీని వల్ల తిన్న ఆహారాన్ని కొంత వరకైనా శరీరం గ్రహించే అవకాశం ఉంటుంది.

No comments:

Post a Comment